ప్రాణాలు కాపాడాలంటే కష్టం కానీ. అదే ప్రాణాలు తీయాలంటే ఎంత సులువో అని కొన్ని కొన్ని ఘటనలు నిరూపిస్తున్నాయి.. ఇక పోతే ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్నది ఏంటంటే టెక్నాలజీ అని చెప్పవచ్చు.. ఈ టెక్నాలజీ నుండి పుట్టుకొస్తున్న కొత్త కొత్త యాప్‌లలో మొదటగా చెప్పుకోవలసింది గేమ్స్.. ఈ గేమ్స్ లలో ఎన్నో రకాలుగా ఉన్నాయి. కొన్ని ఆడటానికి సులువుగా ఉండగా, మరి కొన్ని ప్రమాదకరమైన గేమ్స్ ను అభివృద్ది చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.. వీటిలో బ్లూ వేల్, మోమో ఛాలెంజ్, 'పబ్‌ జీ' గేమ్‌ లు ఆడిన వారిలో కొందరు మరణించిన విషయం తెలిసిందే..

 

 

ఇవే గాక మరికొన్ని ప్రాణాంతకమైన గేమ్‌ లు కూడా ఉన్నాయి. వీటివల్ల కలిగే లాభం ఆవగింజంత కూడా లేదు. అయినా నేటికాలపు పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు.. ఇకపోతే ఇలాంటి వాటిని తలదన్నేలా, అప్పటికప్పుడే ఈ గేమ్‌ ఆడినవారి ప్రాణాలు ఉంటాయో, ఉండవో అని భయం కలిగేలా పుట్టుకొచ్చిన మరో కొత్త గేమ్‌ స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌.. ఈ ప్రమాదకర ఛాలెంజ్‌ వీడియా షేరింగ్‌ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌లో సర్క్యులేట్‌ అవుతూ, ఆందోళన రేకెత్తిస్తోంది..

 

 

ఇక ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ చాలెంజ్ పాఠశాలల యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. ఇకపోతే ఈ చాలెంజ్ లో ముగ్గురు పక్కపక్కనే నిలుచుని ఉంటారు. మధ్యలో ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగరగానే పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరిన వ్యక్తి కాళ్లను ముందుకు తంతారు. దీంతో మధ్యలో ఉన్న వ్యక్తి కింద పడిపోతాడు. తల వెనకభాగం నేరుగా నేలకు తాకే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీనికి స్కల్ బ్రేకర్ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

 

 

మెక్సికోలోని ఓ స్కూల్లో జరిగినట్లు చెబుతున్న ఓ సంఘటనకు చెందిన వీడియో మరింత భయంకరంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇక ఈ చాలెంజ్ చేస్తే శరీరానికి తీవ్ర ప్రమాదం సంభవించడమే కాకుండా, ప్రతి కీలుపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు..

 

 

ఇదే కాకుండా ఈ చాలెంజ్ లో పాల్గొనేవారి నడుము కింది భాగం నేలను నేరుగా తాకడమే కాకుండా, మోకాలు, మడమలకు కూడా గాయాలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక తల నేరుగా నేలకు తగిలి బలమైన గాయమైతే ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని తెలుపుతున్నారు... మరి ఇంతటి ప్రాణాంతకమైన ఆటను కనుగొన్న కిల్లర్ ఎవరో గాని అతన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: