లోకంలో పిచ్చి పనులు చేసేవారు రోజు రోజుకు పెరిగిపొతున్నారు అనడానికి నిదర్శనమే ఇప్పుడు చూడబోయే ఘటన.. ఇకపోతే ఈ మధ్యకాలంలో సెల్ఫీ పిచ్చితో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇదే కాకుండా పబ్జిలాంటి గేమ్స్ తో, ప్రాణాలను ప్రమాదంలో పడవేసుకుంటున్నారు.. మరి కొందరు ఆకతాయిలు వేగవంతమైన బైక్ రైడింగ్ చేస్తూ, వారితో పాటుగా పక్కవారి ప్రాణాలను కూడా తీస్తున్నారు. ఇక ఇదే కాకుండా రైల్లో కూడా పనికిమాలిన పనులు చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించేవారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఇలాంటి పనికిమాలిన వారు రోజు రోజుకు సమాజంలో పెరుగుతున్నారే గాని తగ్గడం లేదు.

 

 

ఇకపోతే ఈ మధ్యకాలంలో రైలంటే బొత్తిగా భయం లేకుండా తయారు అవుతున్నారు. రైలుతో ఆటలాడే వారికి ప్రాణాలంటే భయం లేనట్లుగా ఉందేమో.. అసలు కొద్ది దూరం నుండి రైలు వస్తూ ఉంటేనే గుండెల్లో భయం మొదలవుతుంది.. అలాంటిది కొందరు మాత్రం తమకేమి భయం లేనట్లూ ప్రవర్తిస్తుంటే, ఇలాంటి వారిని చూసినప్పుడు వీడికి యమలోకంలో బెర్త్ కన్‌ఫాం అయ్యిందనిపిస్తుంది.. కానీ ఏం అదృష్టమో తెలియదు గాని ఇలాంటి వెధవపనులు చేసేవారిలో కొందరికి మాత్రం నూకలు బాగా బాకీ ఉన్నట్లున్నాయెమో. ఎందుకంటే ఇక వీడు చచ్చడ్రా అని అనుకొని ఫిక్సయితే ఇలాంటి వాడికి చిన్న గాయం కూడా కాకుండా బ్రతుకుతున్నారు..

 

 

అందుకు ఉదహరణగా ఒక యువకుడికి యముడు రా రమ్మని పిలిచాడనుకుంటా, అందుకే వేగంగా వెళ్తున్న రైలు నుంచి దిగబోయి అదుపుతప్పాడు. అలాంటప్పుడు రైలును పట్టుకున్న రాడ్ వదలాలి కాని అది వదలక అలాగే పట్టుకుని ఉన్నాడు.. ఇలాంటి భయంకరమైన పరిస్దితిలో రెప్పపాటు వ్యవధిలో రైలు నుంచి కిందపడిన వెంటనే అతడి తల రైలు కిందకు వెళ్లింది. అయితే, తల పూర్తిగా చక్రాల కిందకు వెళ్లకపోవడంతో అతడు ప్రాణాలతో బతికిపోయాడు. అసలు ఈ వీడియో చూసేవారికే వణుకు వస్తుంటే, వీడు మాత్రం నింపాదిగా లేచి తన దారిన తాను వెళ్లిపోయాడు. ఇంతటి ప్రమాదకరమైన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తెగ చక్కర్లు కొడుతోంది... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: