తాగరా, తాగి ఊగరా, తాగితే లోకమే నీదేరా.. అన్నారు పెద్దలు.. మద్యం తాగినవాడికి పాముకు, తాడుకు తేడా తెలియదంటారు.. ఇదే కాకుండా నిషా తలకెక్కి తైతక్కలాడితే, ఊరంత తన బందువులే అంటాడు తాగుబోతు.. ఇకపోతే ఒక వ్యక్తి తాగిన మైకంలో బల్లితో లిప్ కిస్సింగ్ చేశాడు.. అదేంటి బల్లికి ఒళ్లంతా విషం అంటారు కదా.. మనిషికి ఉన్న విషం ముందు బల్లి విషం ఎంత.. ఇంతకు విషయం ఏంటంటే.. బీరులో పడి చనిపోయిన బల్లికి, ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి మళ్లీ ప్రాణం పోశాడు. నమ్మబుద్ధి కావడం లేదా.. అయితే ముందు మ్యాటర్ చదవండి తర్వాత వీడియో చూడండి..

 

 

ఇకపోతే ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఉన్న కోడిండీ బీచ్‌ దగ్గర్లో ఉన్న ఓ బార్‌లో మందు తాగుదామని కూర్చున్న డ్రింక్ మాస్టర్‌కు కంటికి ఒక ప్రాణం లేని బల్లి కనిపించిందట. ఆ బల్లి బీరులో పడిందేమో అని భావించిన సదరు వ్యక్తి దాన్ని బతికించాలని నిర్ణయించకుని, తన వేలుతో దాని గుండెలపై నొక్కుతూ సీపీఆర్ చేశాడు. అప్పటికీ స్పందించకపోవడంతో దాని నోటిలో నోరు పెట్టి గాలి ఊదాడు. అంతే.. చనిపోయిందనుకున్న ఆ బల్లి మళ్లీ బతికేసింది. దీంతో ఆ వ్యక్తి చాలా సంతోషపడ్డాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

ఇక సదరు వ్యక్తి నిజంగానే దాని ప్రాణాలను కాపాడాలని ఆ పని చేశాడో లేదా మందు ఎక్కువై సరదాగా చేశాడో తెలీదు.. కాని ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సాధారణంగా బల్లుల్లో ఆత్మరక్షణ వ్యవస్థ చురుగ్గా ఉంటుందని, శత్రువులు కనిపించినప్పుడు అవి చనిపోయినట్లు నటిస్తుంటాయని, శత్రువులు దాడి చేసినప్పుడు అవి తమ తోకను కూడా వదిలేస్తాయని, ఇది కూడా అలాంటిదే అని పేర్కొంటున్నారు కొందరు. ఏది ఏమైనా, ఒళ్లు గగూర్పాటు  కలిగించే బల్లిని.. మరీ నోట్లో పెట్టుకుని ఊపిరి ఊదడమంటే.. సాహసమే కదా.. ఇక ఈ తాగుబోతు బల్లితో చేసిన రోమాన్స్ చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: