లోకంలో మనుషులకు అసలు భయం లేకుండా పోతుంది.. ఎందుకంటే.. కొందరైతే మారణాయుధాలు ఉన్నాయని పదిమందిలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు.. ప్రాణభయం కోసం తీసుకున్న ఆయుధాలను, ఇతరుల ప్రాణాలు తీయడానికి గాని, లేదా పదిమందిలో తుపాకులు చూపిస్తూ అదేదో పెద్ద ఘనకార్యమైనట్లుగా ప్రవర్తిస్తారు. ఇక ఈ మధ్యకాలంలో ఇంకా బలిసిన వారు పెళ్లి వేడుకల్లో తుపాకుల మోత మోగిస్తూ పెళ్లికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు..

 

 

వివాహా వేడుకల్లో ఇలాంటి చర్యలు జరగడం వల్ల ఒక్కొక్క సారి అవి విషాద వేడుకలుగా మారుతున్నాయి.. వారి దర్పాన్ని చూపించడానికి ఇలాంటి చోట్లే కనిపిస్తున్నాయో ఏమో కాని, ఆ తుపాకి గుండు అలా కాల్చినప్పుడు ఎవరికైనా పొరపాటుగా తగిలితే, తగిలిన వారి ప్రాణాలు ఉంటాయా.. గాల్లో కలిసి పోవు. మరి ఈ విషయంలో చట్టం కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడం సమంజసం కాదు.. ఈ మధ్యకాలంలో ఇలాంటి పిచ్చి పనులను చాలామంది అవలంబిస్తున్నారు..

 

 

ఇక మందుతాగిన అతని దగ్గర ఇలాంటి ఆయుధం ఉంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికిన రీతిగా అతడు ప్రవర్తించే దానికి బాధ్యులు ఎవరు.. పెళ్లికని వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవాలా.. ఇలాంటి గన్ కల్చర్‌కు అడ్డుకట్ట వేయకుంటే, అక్కడ ఏదైనా వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద గొడవగా మారి ఎందరి ప్రాణాలకు ముప్పు ఉంటుందో ఒక్క సారి ఊహించండి.. ఇక ఇలాంటి పనికి మాలిన పని ఓ పెళ్లిలో కూడా జరిగింది..

 

 

ఉత్తరప్రదేశ్‌లోని జబ్రౌలీ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. తాగిన మత్తులో ఉన్న అతడు వేదికపై డ్యాన్సు చేస్తున్న డ్యాన్సర్ వద్దకు వచ్చాడు. అనంతరం తన ఫ్యాంటులో వెనుక వైపు ఉంచుకున్న గన్ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఆ పెళ్లికి హాజరైన అతిథులు కంగారుపడ్డారు. ఇలాంటి పనే ఇదివరౌ ఓ వ్యక్తి చేయగా, ఆడ్యాన్సర్ తలలోకి తుపాకి గుండు చొచ్చుకు పోయింది.. అలాగే ఈ పెళ్లిలో కూడా ఇతను ఇలాగే చేసాడు.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: