నేటికాలంలో ప్రతి వారు పిల్లలను కంటున్నారు గాని.. వారికోసం సమయాన్ని వెచ్చించడం లేదు.. ఏ ఆయా కో, లేదా బేబీ కేర్ సెంటర్లో అప్పచెబుతున్నారు.. వారికి ఊహా తెలిసిన, తెలియకున్నా, పిల్లలకు తల్లిదండ్రుల చెంతనే ఆనందం ఉంటుందనే విషయాన్ని విస్మరిస్తున్నారు.. ఇప్పటి పరిస్దితులు ఎలా ఉన్నాయంటే పిల్లల పెంపకం, కోళ్ల ఫాంలో కోళ్ల పెంపకంలా మారింది.. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు బిజీ బిజీ.. ఇకపోతే పిల్లలకు తమ పేరెంట్స్‌తో ఆడుకోవాలని, వారితో ముచ్చట్లు పెట్టాలని అనిపిస్తుంది. కాని ఎక్కడా అంతా ఉరుకుల పరుగుల జీవితం..

 

 

ఇకపోతే ఓ చిట్టితల్లి ఏదో పని చేసుకుంటున్న తండ్రి దగ్గరకు వచ్చి.. నాన్నా ఆడుకుందాం రా అనిపిలిచింది.. ఇలా పిలిస్తే కొందరైతే ఛీపో నేను పనిలో ఉన్నా నీకెప్పుడు ఆటలే లోకం అని కసురుకుంటారు.. కానీ ఇది కరెక్ట్ కాదు.. ఆ పసి మనుసులను కఠినమైన మాటలతో గాయపరచవద్దు.. ఇక ఆ పసిపిల్ల పిలవగానే ఆ తండ్రి ఏమాత్రం కోపం ప్రదర్శించకుండా తన మెదడుకు పదునుపెట్టి కొత్తగా ఆలోచించాడు.. ఇంకేం ఉంది రూపాయి ఖర్చులేకుండా తనకు వచ్చిన ఆలోచనతో ఆ పసిదాని మనసులో ఆనందాన్ని నింపాడు..

 

 

ఇంతకు అతను చేసిన పని ఏంటంటే.. ముందుగా టీవీ పెట్టాడు. నాన్నా ఆడుకుందామంటే టీవీ పెడతాడేంటి అని మనసులో అమాయకంగా ఆలోచిస్తుంది ఆ చిన్నది.. ఎంత సేపని అలా ఉంటుంది. ఇక ఉండపట్టలేక ఏం చేస్తున్నావు నాన్నా అని అడగ్గ, ఆ తండ్రి నా బంగారు చిట్టితల్లి.. నిన్ను రోలర్ కోస్టర్ ఎక్కిస్తాగా.. అన్నాడు. ఏంటీ ఇంట్లో రోలర్ కోస్టరా? అని అమాయకంగా కళ్లు చక్రాల్లా తిప్పుతు అడిగింది చిట్టితల్లి. ఆ.. రోలర్ కోస్టరే అంటూ టీవీలో రోలర్ కోస్టర్ గేమ్ ప్లే చేసి, తన చిట్టితల్లిని ఓ ప్లాస్టిక్ బుట్టలో కూర్చోపెట్టాడు.

 

 

టీవీలో రోలర్ కోస్టర్ గేమ్ ప్లే అవుతుంటే... ఆ పిల్ల కూర్చున్న బుట్టను వెనకాల నిలబడి నాన్న రోలర్ కోస్టర్‌కి తగ్గట్లుగా మూమెంట్ ఇస్తూ, అటూ ఇటూ ఊపుతూ...నిజంగానే రోలర్ కోస్టర్ ఎక్కిన ఫీలింగి కలిగించాడు... ఇక తను ఇంట్లో ఉన్న సంగతి మర్చిపోయిన ఆ పాప నిజంగానే రోలర్ కోస్టర్ ఎక్కి రయ్ రయ్ మంటూ వెళ్తున్నట్లుగా ఫీలైపోతూ... మధ్య మధ్యలో కేరింతలు కొడుతూ... ఒక్కోసారి కింద పడిపోతానేమో అన్నట్లు భయపడుతూ ఉంటే... ఆ దృష్యాలను మొత్తం వీడియో తీసిన ఆ తండ్రి సోషల్ మీడియాలో పోస్టు చేయగా. అదికాస్తా వైరల్ అయిపోయింది. చూసారుగా నిజమైన ప్రేమతో ఆలోచించి మీ పిల్లల కళ్లముందే ఇలాంటి ఆనందాన్ని కృతిమంగా సృష్టించవచ్చని నిరూపించిన ఈ తండ్రికి ఫిదాకాని వారులేరు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: