అమ్మ అనే రెండక్షరాల పదం అమృతం కంటే తీయనైనది.. అమ్మ ప్రేమ మహా యోధులకంటే బలమైనది.. అమ్మ పిలుపులోని కమ్మదనం ఎల్లలుదాటిన చెరగని మధురఫలం.. అమ్మా అంటే చాలు సృష్టి పులకించిపోతుంది.. ఎందుకంటే స్వార్ధం అంటే తెలియక గుప్పెడు గుండెలో ఆకాశమంత ప్రేమను మాత్రమే దాచేది.. పంచేది అమ్మే కదా.. ఇదే కాకుండా తన పొత్తిళ్ళనే  మెత్తటి పాన్పుగా చేసి, నును వెచ్చని తన ఒడిలో పదిలంగా పొదువుకుని, తన గుండె చప్పుడుని జోల పాట గా మలచి, వేలు పట్టి నడిపి, తన మాటలతో ముల్లోకాలను మనకు సాక్షాత్కరింపచేసే దైవం అమ్మేకదా..

 

 

ఇంతలా వెలకట్టలేని అమ్మ ప్రేమముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.. తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే పిరికెడు ప్రాణం కూడా పిడికిలి బిగించి పోరాడుతుంది.. ఇలాంటి దృష్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి.. అక్కడ బలం ఉన్నదానిదే పై చేయి.. బ్రతకడం కోసం నిత్యం పోరాటం చేయక తప్పని పరిస్దితి.. ఈ సృష్టిలో జీవుల ఆకారాల్లో తేడాలున్నాయి గాని వీటి ప్రేమలో మాత్రం రవ్వంత తేడా కనిపించదు.. అమ్మంటే అందరికి అమ్మే.. అది మనిషి, జంతువు, పక్షి ఇలా ఏ ప్రాణికి అయినా ఒకటే. మొత్తానికి సృష్టిలో ఉన్న అన్నిజీవ రాశుల్లోనూ కనిపించే సారూప్యం.. తల్లిప్రేమ ఒక్కటే. ఒక్కోసారి తల్లి చూపించే ప్రేమ..త్యాగం అందరి గుండెల్ని చేమరుస్తాయి...

 

 

అటువంటిదే ఈ సంఘటన కూడా. అదేమంటే... చెట్టు తొర్రలోకి ప్రవేశించిన ఓ పది అడుగుల విష సర్పం అక్కడ ఉన్న వండ్రంగి పిట్ట గుడ్లను తినేయడానికి ప్రయత్నం చేస్తుండగా, తన పిల్లలకు పోంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన ఆ పక్షి, వాటిని రక్షించుకోవాలని చేసే ప్రయత్నాన్ని ఒక వ్యక్తి షూట్ చేశాడు.. పక్షి ప్రాణం చిన్నదైనా దాని ప్రయత్నంలో ఎలాంటి లోపం కనిపించలేదు..

 

 

బలవంతమైన ఆ పాము వడ్రంగి పిట్టని నాలుగైదు సార్లు కాటేయగా, ఆ పిట్ట నెల కూలింది. అయినా సరే, తన పట్టు వదల కుండా మళ్ళీ లేచి వచ్చి ఆ సర్పం మీద దాడి చేస్తూనే ఉంది.. అంత పెద్ద పాము కోరలు తనను బాధించినా ఆ వడ్రంగి పిట్ట తన గుడ్లను రక్షించుకోవడానికి చేసిన పోరాటం ఎన్నో జీవన సత్యాలను చెబుతోంది.. పోరాట స్ఫూర్తిని వెల్లడిస్తోంది...

 

 

ఈ వీడియో చూసిన ప్రతివారు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. సర్పంలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా ఈ పక్షిలా పోరాడాలి కానీ పిరికివారిలా ఆత్మహత్యలు చేసుకోకూడదు.. ఈ సత్యన్ని తెలుసుకుంటే జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలను జయించవచ్చూ.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: