ఏనుగు అంటే మనుషులకు కూడా భయమే.. మావటి పక్కన ఉంటే భయపడరు కానీ, మావటి వాడు లేకుంటే ఏనుగు దగ్గరికి వెళ్లాలంటే వణుకు వస్తుంది.. కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఈ గజరాజులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి భక్తుల ముందుకు తీసుకు వస్తారు.. ఇలాంటి ఏనుగులు ప్రజల్లో తిరగడానికి అలవాటుపడి ఉంటాయి కాబట్టి వీటివల్ల అంతగా భయం ఉండదు.. అదే అడవిలో నివసించే గజరాజుల కంటికి మనుషులు కనిపించారంటే వెంటపడి మరి తరుముతాయి..

 

 

ఇక ఈ ప్రకృతిలో ముఖ్యంగా అడవుల్లో పెద్ద ప్రాణులకు చిన్న ప్రాణులు భయపడతాయి.. కౄరమృగాలకు కూడా భయపడుతూ బ్రతకవలసిందే.. కానీ అప్పుడప్పుడు మాత్రం కొన్ని అరుదైన దృష్యాలు కనిపిస్తాయి.. అలాంటి వాటిలో ఇప్పుడు మనం చూడబోయే అద్భుతం ఒకటి.. అదేమంటే...

 

 

ఒక గేదే తన దూడతో గడ్దిమేస్తుండగా అక్కడికి ఏనుగు వచ్చింది. ఆ ఏనుగును చూసిన ఆ చిన్ని దూడ ఏమనుకుందో ఏమో కానీ అస్సలు భయం లేకుండా తన కంటే ఐదు రెట్లు పెద్దగాఉన్న ఏనుగును భయపెట్టి, బెదిరించి, హడలెత్తించింది. నిజానికి ఆ సమయంలో ఏనుగు తలచుకుంటే... తన తొండంతోనో, కాలుతోనో ఆ దూడకు ఒక్కటివ్వగలదు. కానీ... ఆ ఏనుగుకి... దూడపై జాలి కలిగిందేమో, లేక ఆ చిన్న దూడను చూస్తే ముచ్చటేసిందేమో, తెలియదు గానీ ఏమీ అనకుండా వెనక్కి వెళ్లసాగింది.

 

 

ఐతే... ఆ ఏనుగు బలం తెలియని దూడ అంతా తన గొప్పతనం అని మురిసిపోతుండవచ్చు కానీ దాని తల్లైన గేదెకి తెలుసు... అందుకే ఆ గేదె అమ్మో... నా పిల్ల ఆ  ఏనుగు జోలికి వెళ్తోంది... ఇంకేమైనా ఉందా అనుకుంటూ... ఆ లేగ దూడను ఆపేందుకు వెనకాలే పరిగెత్తింది. కానీ ఆ బుజ్జి దూడకు ఇదంతా అవసరం లేదుగా.. అయితే లక్కీగా ఆ ఏనుగు.. దూడను ఏమీ చెయ్యలేదు... పైగా తనే పారిపోయింది. ఇక గజరాజు తన పెయ్య జోలికి రాకపోవడంతో, తల్లి గేదె ఎంతో సంతోషించింది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: