కరోనా వైరస్ వచ్చుడు ఏందో గాని మార్కెట్లో మాస్కులకు, సానిటైజర్ లకు ఒకేసారి రెక్కలువచ్చి ఆకాశంలో విహరిస్తున్నాయి.. నెల క్రితం వరకు ఎవరు పట్టించుకోని వీటికి ఇప్పుడు మాత్రం చాలా డిమాండ్ ఏర్పడింది.. ఇక ఇదివరకు చేతులు కడుక్కోండిరా అంటే వినని మొండివాళ్లు సైతం చేతులు శుభ్రపరచుకోవడం, వీలైనంత వరకు కరచాలనం చేయకపోవడం లాంటివి చేస్తూ శుభ్రత పాటిస్తున్నారు..

 

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం మార్కెట్లో సానిటైజర్ దొరకడం లేదట. ఎక్కువగా ఎక్కడ చూడు నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి.. ఇలాంటి సమయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు, సామాన్య ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఓ  కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఇందులో భాగంగా ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలిపే ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

 

 

ప్రస్తుతం మార్కెట్లో హ్యాండ్ సానిటైజర్ల కొరత ఏర్పడటమే కాదు వీటి రేట్లు కూడా అమాంతం పెరిగాయి... అంతేకాదు 50 ఎంఎల్ సానిటైజర్ ధర రూ.100 దాకా పలుకుతోంది. మరికొన్ని మెడికల్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ ఎలా తయారుచేసుకోవాలని అనే అంశంపై ఆయన విడుదల చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తు వైరల్ గా మారింది...

 

 

ఇక కొండా చేసిన పనికి అటు రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎందుకంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వరుసకు రామ్ చరణ్ కు మామ అవుతారు. ఇక మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లోనే ఏంచక్కా వీలైతే ఈ సానిటైజర్ తయారు చేసుకోండి.. ముఖ్యంగా కరోనా భారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి..

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: