ప్రపంచంలో మనుషులు జంతువుల్లా బ్రతకడానికి అలవాటు పడుతుంటే.. ఆ జంతువులు మనుషుల్లా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాయి.. మనిషికి మనిషి ఆపదవస్తే సహాయం చేయడానికి ఆలోచిస్తాడు కానీ.. జంతువులు ఆలోచించవు.. తమతోటి ప్రాణులు ఆపదలో ఉన్నప్పుడు వాటికి ప్రాహణ హాని తలపెట్టవు.. కానీ మానవుని తత్త్వము అలా కాదు.. ఎక్కడైన ప్రమాదం జరిగిందనుకో అక్కడ మనిషికి అవసరమైన వస్తువులు ఉంటే ముందుగా వాటిని ఇంటికి జారకొట్టుకుంటాడు.. కానీ ఆ ప్రమాదంలో గాయపడ్డవారిని రక్షింద్దాం అని ఆలోచించడు..

 

 

ఇలా ఈ మధ్యకాలంలో ప్రమాదాల బారిన పడిన మద్యం లారీలు కానివ్వండి, కూల్‌డ్రింక్స్ వాహానాలు గానీ, లేదా ఏదైన వాహనం ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైతే అక్కడ ఏది దొరికిన వదలరు.. ఒక్కోసారి సెల్ ఫోన్లు, లేదా మరణించిన వారి మెడలో ఉన్న బంగారం ఇలా ఏది దొరికితే దాని పై తన చేతివాటం ప్రదర్శిస్తారు.. ఇలాగ మనిషి ప్రవర్తనకు భిన్నంగా జంతువులు ప్రదర్శిస్తున్నాయి.. ఇక్కడ మనకు కనిపించే వీడియోలో ఒక ఎలుగు బంటి తన తోటి ప్రాణి ప్రాణాలు కాపాడింది..

 

 

అదేమంటే తాను సంచరిస్తున్న నీటి కొలనులో ఒక కాకి ప్రమాద వశాత్తు పడిపోయి మునకలు వేస్తుంది.. ఎవరైన వచ్చికాపాడితే బాగుండును లేదంటే తన ప్రాణం పోవడం ఖాయం అని అనుకుంటూ బిక్కుబిక్కుమంటుంది... పక్కనే ఎలుగుబంటి ఉంది కాని అది తనను రక్షిస్తుందా.. ఒకవేళ తనను రక్షించిన తినేస్తుందేమో అనే భయంతో మునుగుతూ, తేలుతూ ఉండంగా నీటిలో పడి ప్రాణాపాయ స్దితిలో విలవిల్లాడుతున్న కాకిని చూసి జాలిపడింది ఆ ఎలుగుబంటు. వెంటనే అది తన నోటితో కాకిని పట్టుకుని ఒడ్డున వదిలేసింది.

 

 

అయితే, కాకి ఆ ఎలుగు బంటి తనని తినడానికే బయటకు తీసి ఉంటుందని భావించి చనిపోయినట్లు నటించింది. కానీ ఆ ఎలుగు బంటి మంచి మనసు తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. చూశారుగా.. తోటి జంతువు ఆపదలో ఉన్న పక్షికి ఆలోచించకుండా సహాయం చేసింది.. కానీ మనుషులు మాత్రం నాకేంటి అనుకుంటూ చూస్తూ వెళ్లిపోతారు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: