ఆ పండుగాడు ఎవరి మాట వినకుండా బాక్సాఫీస్‌ను బద్దలు కొడితే.. ఈ కరోనా కూడా పండుగాడిని మించి ప్రజల్లోకి దూసుకెళ్లుతుంది.. ఒకటిగాదు రెండు కాదు.. షేర్ ఖాన్ వందలు వేల సంఖ్యల్లో ప్రాణాలు తీసేస్తా అంటూ ఉరిమే ఉత్సాహంతో ముందుకెళ్లుతుంది కరోనా.. దీన్ని ఆపాలంటే కట్టప్ప లాంటి వారితో కూడ కావడం లేదట. ఎందుకంటే ఇండియాలో ఎందరో మొండి కట్టప్పలు ఉన్నారు.. వారందరు వారి మాటలే వినరు ఇక పక్కోడి మాటలు ఎక్కడ వింటారు.. ఇలాంటి వారి వల్ల ఈ వైరస్ ఆనందంగా అందరికి అంటుకుంటూ వెళ్లుతుంది..

 

 

ఇక కరోనా విషయంలో కామన్‌సెన్స్ ఉన్న ప్రతి వారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, వారిని రక్షించుకోవడమే కాకుండా, తమతోటి వారిని కూడా కాపాడాలని ఆలోచిస్తారు.. ఇక కొందరు ఖర్కోటకులు ఉంటారు.. క్వాటర్ సీసా మందు కొడితే కరోనా ఏంది రా దాని ఆమ్మకూడ పారిపోద్దని పనికి మాలిన మాటలను వల్లెవేస్తుంటారు.. ఇదిగో ఇలాంటి వారే కరోనాకు కావాలి.. అందుకే ఈ విషయంలో అవగహన కలిగించడానికి, మట్టి బుర్రల్లో కాస్త మట్టి తీసేసి ఆలోచనను పెంచాలని, ఒకవైపు ప్రభుత్వం, మరో వైపు స్వచంద సంస్దలు, సినీ తారలు ఇలా అందరు కలసి అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. మరి కొందరు వీడియోలు చేస్తూ అవగహన కలిగిస్తున్నారు..

 

 

సమస్త ప్రజల్లారా మీ ఆరోగ్యం, మీ బిడ్డ ఆరోగ్యం, మీ బంధువులు, ఆప్తులు ఇలా అందరు పదికాలాల పాటుగా బాగుండాలంటే కరోనాను కట్టడి చేయడానికి నేటి నుండే కంకణం కట్టుకోండి.. ఈ భయంకరమైనా కరోనాను నిర్లక్ష్యం చేయకుండా, పూర్తిగా ప్రపంచాన్ని ఆక్రమించక ముందే మేల్కొనండి.. జాగ్రత్తలు పాటించండి.. ఇది మీ ఒక్కరి కోసం కాదు.. అందరి శ్రేయస్సు కోసం..

 

 

ఇంట్లో కూర్చుని నీతులు చెప్పడం కాదు ఆచరించి చూపండి.. ఇకపోతే కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు పక్కవాళ్లను కూడా కాపాడటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంచు లక్ష్మి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఐదు చిట్కాలు చెప్పారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: