కరోనా.. కరోనా.. కరోనా.. రోజంతా కూడా కరోనా వైరసే. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. అలాంటి ఈ కరోనా వైరస్ నుండి కాపాడుకోడానికి సెలబ్రెటీల నుండి పోలీసుల వరుకు ప్రతి ఒక్కరు వారి పద్దతిలో వివరిస్తున్నారు.. 

 

కొత్త కొత్త పద్దతులలో వినూత్నంగా, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే రాచకొండ పోలీసులు కూడా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు.. అయితే ఆ ప్రచారం సోషల్ మీడియాలో మరి ఎక్కువగా చేస్తున్నారు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రాచకొండ పోలీసులు కరోనా వైరస్ పై అవగాహనా కల్పిస్తూ ఓ వీడియోను షేర్ చేసారు... 

 

అసలు ఆ వీడియోలో ఏముంది అంటే.. సబ్బు, శానిటైజర్, హ్యాండ్ వాష్ యేసుడైన సరే ఎలా ఉపయోగించాలి.. ఎంతసేపు కడిగితే క్రిములు పోతాయి?  ఎంతసేపు చేతులను వెనుక ముందు కడుకోవటం వల్ల వైరస్ తొలిగిపోతుంది అనేది ఆ వీడియోలో ఉంది.. ఆ వీడియో ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

 

రాచకొండ పోలీసులు ఆ వీడియో షేర్ చేస్తూ... ''శానిటైజర్ లేకుంటే సబ్బు జేబులో పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనివార్యం. ఇతరులు ముట్టుకొన్న ఏ వస్తువును తాకినా 20 సెకన్ల పాటు చేతులను వెనుక ముందు కడుక్కోవటం మరువొద్దు.'' అంటూ ఆ వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: