ప్రపంచదేశాలన్ని కంటికి కనబడి రాక్షసులతో యుద్ధాలు చేస్తున్నాయి.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాన్ని మనసు నిండా నింపుకుని క్షణం ఒక యుగంలా బ్రతికేస్తున్నారు.. రాబోయే రోజుల్లో మరణాన్ని జయించి విజేతగా ఎవరు మిగులుతారో అనే ఆశతో ఎదురు చూస్తున్నారు.. ఇన్నాళ్లు మనుషుల్లో పాతుకుపోయిన నిర్లక్ష్యాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తున్న వారెందరో ఉన్నారు.. వేసవికాలం ఒక్క నీటి చుక్క కూడ దొరక్క పిచుక నేలపై రాలిపోయే దృష్యాన్ని ఊహించుకోండి.. ప్రస్తుత పరిస్దితుల్లో ఇటలీ ఇలాంటి దుస్దితినే అనుభవిస్తుంది.. కనీసం చనిపోయిన ఆప్తులను కూడా చివరి చూపు చూసే వీలు లేకుండా ఈ మాయదారి రోగం చేస్తుంది..

 

 

ఒక వేళ భారత్‌లో కనుక ఇలాంటి దుస్దితి వస్తే పరిస్దితి ఊహించడం చాలా కష్టం.. ఎన్నిలక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో చెప్పలేం.. ఇప్పుడు మీరు చూస్తున్న కరోనా అనే రోగం ఏదో పారాసిటమల్ వేసుకుంటే తగ్గిపోయేది కాదు.. కాస్త అర్ధం చేసుకోండని అధికారులు చెబుతుంటే మట్టిబుర్ర మనుషులు కొంపలు అంటుకుపోయినట్లుగా రోడ్లమీదకు వస్తున్నారు.. ఓరి వెర్రిబాగుళ్లారా బ్రతికి ఉంటే పచ్చడి మెతుకులు తింటూ అయినా ఉండవచ్చు.. చస్తే పాడేకూడ కట్టర్రా.. అర్ధం చేసుకోండిరా అంటే వినడం లేదు నా కొడుకులు..

 

 

ఇకపోతే దేశం మొత్తం లాక్‌డౌన్లోకి వెళ్లిపోయిన నేపధ్యంలో మాట వినని మనుషుల విషయంలో పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. బయట తిరిగే ప్రజలను లాఠీలతో కొట్టి ఇళ్లకు పంపిస్తున్నారు. వాహనాల్లో గాలి తీసేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పోలీసులు కనిపించిన వాహానలను లాఠీలతో కొట్టి ధ్వంసం చేస్తున్నారు.

 

 

చివరికి రిక్షా పుల్లర్‌ను కూడా విడిచిపెట్టడం లేదు. టైర్లలో గాలి తీసేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం 8 కేసులు నమోదు కాగా, వీరందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం ఇలాంటి దృష్యాలు చాల చోట్ల జరుగుతున్నాయి.. ఇక కరోనా వ్యాప్తిని ఆపడానికి ఈ వీడియోలో రక్షకభటులు పడుతున్న కష్టాలు చూడండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: