కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్ని అల్లాడిపోతున్నాయి.. ఈ పరిస్దితుల్లో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటూ పరిస్దితులను అదుపులోకి తెచ్చెందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.. ఇందుకు గాను కరోనా విస్తరించిన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి..  ఇక రాష్ట్రమంతటా కర్ఫ్యూను కూడా విధించారు.. ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో కొందరు మనుషులు మాత్రం ఏదో తాము బయటకు వెళ్లకుంటే కొంపలు అంటుకు పోయినట్లుగా, కోట్ల ఆదాయాలు తాము కోల్పోతున్నట్లుగా ఫీలవ్వుతూ పనిపాటలేని సన్నాసుల మల్లే షికార్లు చేస్తున్నారు..

 

 

ఇప్పటికే కరోనా వైర దాటికి ఇటలీలో మనుషులు కాకుల్లా రాలిపోతుంటే. ఇలాంటి దుస్దితిని మనదేశ ప్రజలు చే చేతులారా తెచ్చుకోవడానికి కుక్కల్లా రోడ్లపైకి వస్తున్నారు.. కనీసం చదువుకున్న వారికి బుద్ధి, జ్ఞానం ఉండాలి.. చదువులేని వారికి చెప్పి వారిని కూడా జాగ్రత్త పరచాలనే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి.. దున్నపోతుల్లా తింటు.. తిన్నది అరక్క బైకులు పట్టుకుని రోడ్లమీద షికార్లు చేసే సమయమా ఇది.. ప్రధానమంత్రి స్దాయి వ్యక్తి చేతులెత్తి దండం పెట్టవలసిన అవసరం లేదు.. మనకోసం, మన అనుకున్న వారికోసం, మన దేశం కోసం ఇలాంటి చర్యలు చేపడుతుంటే బుద్ధిగా ఒకచోట కూర్చోకుండా కోతిలెక్కలు చేస్తున్నారు..

 

 

ఇక మనదేశంలో ఇలాగే బుజ్జగిస్తే ఎవరు వినడం లేదు.. ఒకవేళ ఆర్మీ కనుక రంగంలోకి దిగితే ఆ పరిస్దితులు వేరేలా ఉంటాయి.. ఇప్పటికే కరోనా భయంతో అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి.. ఇదిలా ఉండగా పాకిస్తాన్‌ను సైతం కరోనా వైరస్ వణికిస్తోంది. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి అక్కడ కూడా కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బయటకు వస్తే చాలు అప్పటికప్పుడు శిక్షలు విధిస్తున్నారు. ఇండియాలో పుణె పోలీసులు గుంజీలు తీయించినట్లే.. పాకిస్తాన్‌లో కూడా అలాంటి శిక్షలు వేస్తున్నారు. సింద్ ప్రాంతంలో రోడ్లపై తిరుగున్న కొంతమందిని ఇదిగో ఇలా వంగోబెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.. కాగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..  

 

 

    

మరింత సమాచారం తెలుసుకోండి: