ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది.. ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒకరికొకరు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారి చేసాయి.. అధికారుల మాటలు పట్టించుకుని ఎవరికి వారు బుద్ధిగా ఇంటి నాలుగు గోడల వరకే పరిమితం అయితే చాలా మంచిది.. లేదంటే ఇప్పుడున్న నవ్వులు, ఆనందాలు అన్ని శ్మశాన వాటికలను తలపించే ముప్పు ఉందని ఆరోగ్య సంస్దలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి..

 

 

ఇకపోతే మతిలేని కొందరు చేసేపనుల వల్ల డాక్టర్లకు, నర్సులకు, పోలీసులకు పని పెరిగిపోతుంది.. ఎందుకంటే రోగాల సంఖ్య పెరగకుండా చూడాలని ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్న చెత్త వెధవలు పట్టించుకోవడం మానేస్తున్నారు.. నిజాన్ని గ్రహించకుండా రోడ్ల మీదకు వచ్చి పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో ఖాళీ రోడ్లపై షికారుకు వస్తున్న ఆకతాయిలను నియంత్రించడానికి పోలీసులు రేయింబవళ్లు శ్రమించాల్సి వస్తోంది. కొందరైతే వారి ఇళ్లను కూడా మరచి రోడ్లపైనే గడుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల చేతుల్లో దెబ్బలు కూడా తింటున్నారు..

 

 

ఇనాళ్ల పోలీసు డ్యూటీల్లో ఇప్పుడు పడుతున్న కష్టాలు మామూలుగా లేవు.. ఎందుకంటే ప్రజల కోసం తమ కుటుంబాన్ని వదిలి రోజుల తరబడి బయట గడపాల్సి వస్తోంది. ఇక చిన్నపిల్లలున్న పోలీసుల ఇంట్లో వారి పిల్లలతో గడిపే సమయమే ఉండటం లేదు.. ఇకపోతే ముంబయిలోని ఓ పోలీస్ కానిస్టేబుల్ విధులకు హాజరయ్యేందుకు రెడీ అవుతుండగా, అతడి కొడుకు తన తండ్రి ఇంట్లోనే తనతోపాటే ఉండాలని కోరుకుంటూ ఏడ్వడం చూస్తే గుండె బరువెక్కుతుంది.

 

 

నాన్న ఇంట్లోనే ఉండు. బయట కరోనా ఉంది వెళ్లొద్దు’ అంటూ ఏడుస్తున్న ఆ పిల్లాడిని తండ్రి ఎత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్న ఊరుకోవడం లేదు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: