కరోనా పేరు చెబితేనే మనుషులు కంటికి కనిపించకుండా పారిపోతున్నారు.. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న నేపధ్యంలో ఒళ్లును, ముఖ్యంగా చేతులను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.. మూతికి మాస్క్ లేకుంటే బయటకు వెళ్లాలంటే ఒక్కొక్కరికి పడుతుంది. ఇంతలా జాగ్రత్తలు తీసుకుంటున్న, భయం భయంగా బ్రతకవలసి వస్తుంది.. ఇలాంటి పరిస్దితుల్లో కొందరు పనికిమాలిన వారు కొత్త ఛాలెంజ్ అంటూ వెర్రివేషాలు వేస్తున్నారు.. కరోనా ఛాలెంజ్ అంటూ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు..

 

 

ఒకరు ముట్టిన వస్తువులను మరొకరు ముట్టాలంటేనే వణికిపోతున్న క్రమంలో ఈ ఛాలెంజ్ పేరు చెప్పి టాయిలెట్ నాకుతున్నారు.. ఒక టాయిలెట్ ఏం ఖర్మ  వివిధ ప్రాంతాల్లో కనిపించిన వస్తువులను నాకుతూ వీడియోలు తీసుకుంటున్నారు. వాటిని టిక్‌ టాక్‌లో పోస్టు చేసి పాపులారిటీ సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి వీడియోలే చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఓ మోడల్ విమానంలోని టాయిలెట్‌ కమోడ్ నాకుతూ వీడియో తీసుకుని ఛాలెంజ్ విసిరింది. అది వైరల్‌గా మారడంతో మిగతా వ్యక్తులు కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించి.. టాయిలెట్లు నాకుతున్నారు.. ఈ కంత్రీలకు పోయేకాలం దగ్గరపడ్డట్లుగా ఉంది.. లేకపోతే ప్రతి వారు వాడే ఈ టాయిలెట్లను కరోనా వచ్చి చస్తున్న సమయంలో నాకడం ఏంటని కొందరు నెటిజన్స్ విసుక్కుంటున్నారు..

 

 

ఇకపోతే ఇంతటి దరిద్రమైన పనిని మొదలు పెట్టింది 21 ఏళ్ల అమెరికా మోడల్ అవా లూయిస్.. ఈవిడ ఫస్టు విమానంలోని టాయిలెట్ కమోడ్ సీటును నాకుతున్న వీడియోను టిక్‌టాక్‌లో పోస్టు చేసింది. మతి లేని యువత అప్పటి నుంచి సూపర్ మార్కెట్లలో వస్తువులను, టాయిలెట్లను పిచ్చిపట్టినట్లుగా నాకుతూ వీడియోలు తీసుకుంటున్నారు. దీనిపై లూయిస్ మాట్లాడుతూ.. తాను టాయిలెట్‌ను శానిటైజర్‌తో శుభ్రం చేసిన తర్వాతే నాకానని అయితే తాను చేసిన పనికి సిగ్గు పడటం లేదని పేర్కొంది. ఇకపోతే ఈ వీడియోతో పాపులర్ కావడం ద్వారా తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొంది...

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

   

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: