ప్రపంచం వణుకుతుంది.. పుడమి కన్నీరు పెడుతుంది.. జనన మరణాలు తధ్యం కానీ ఇలాంటి మరణాలు అవసరమా అని కరోనా సోకిన ప్రతి మనస్సు కన్నీరు పెడుతుంది.. ఒక తల్లి తన చంటి బిడ్దను చూస్తూ నేను చచ్చిపోతే నా బిడ్ద ఎలా బ్రతుకుందో అనే ఆవేదన పడుతుంది.. ఇలాంటి ఆలోచనలు ఒక తల్లి మనస్సులోనే కాదు.. ఇప్పుడు లోకంలో ప్రతివారి మదిలో కదలాడుతున్నాయి.. ఏ క్షణం ఈ కరోనా కాటేస్తుందో అనే భయం వెంటాడుతుంది.. ఇన్నాళ్లూ ఆనందంగా గడిపిన జీవితాలు క్రమక్రమంగా అంధకారంలోకి వెళ్లుతున్నాయి.. రానున్న రోజులు మరింత దుర్లభంగా మారనున్నాయని ఇప్పడు జరుగుతున్న సంఘటనలను చూస్తే అర్ధం అవుతుంది..

 

 

ఈ దశలో ప్రతి దేశం కరోనా వచ్చిన వారిని హింసకు గురిచేస్తుంటే మన భారతదేశం మాత్రం ఇంట్లో ఉండి బ్రతకండిరా అని చెబుతుంది.. ప్రధానమంత్రి స్దాయి వారే చెతులెత్తి దండం పెట్టారంటే అర్ధం చేసుకోండి.. ఈ కరోనా పరిస్దితి ఏ స్దాయిలో ఉందో.. అందుకే దీన్ని కట్టడి చేయడానికి లాక్‌డౌన్ ప్రకటించింది ప్రభుత్వం.. ఈ సమయంలో మనవంతుగా మన బాధ్యతను బయటకు వెళ్లకుండా ఉండి సక్రమంగా నిర్వహించవలసింది పోయి.. బాధ్యత లేకుండా జులాయి వెధవల్లా రోడ్లపైకి వస్తున్నారు కొందరు ఆకతాయిలు.. కనీసం వారికి ఇంత జ్ఞానం లేదా.. కనులకు కట్టినట్లుగా ప్రమాదం ముంచుకొస్తుంటే, ఇటలీ, చైనా, అమెరికా లాంటి దేశాలు అల్లాడిపోతుంటే.. భయంతో ఉండవలసింది పోయి అజ్ఞానంతో బయటకు వస్తున్నారు..

 

 

చస్తే నువ్వొక్కడివే చావు.. అంతే కానీ ఈ రోగాన్ని అంటించుకుని అది నీ ద్వారా పదిమందికి అంటించి అందర్ని ఎందుకురా చంపుతావు.. భారతదేశ ప్రజలను బ్రతికించాలని. పోలీసులు, డాక్టర్లు, ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాయో ఒక్క సారి ఆలోచించు.. ఇకపోతే ఇలాంటివేవి ఆలోచించకుండా లాక్‌డౌన్ నిబంధనలను లాకౌట్ చేసి రోడ్ల మీదకు వచ్చే ‘కోవిడియెట్స్’ను ఇప్పటి వరకు పోలీసులు చితకబాదడమే చూశాం.

 

 

అయితే, కర్ణాటకలోని కలాబురాగీ ప్రాంతానికి చెందిన పోలీసులు.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే పనులను వాళ్లకు అప్పచెప్పారు.. ఇందులో భాగంగా చేతికి చీపుర్లు ఇచ్చి రోడ్లను శుభ్రం చేయిస్తున్నారు. అంతటితో ఆగకుండా రోడ్లపైనే వివిధ శిక్షలు వేసి.. మళ్లీ కనిపిస్తే లాఠీలు విరుగుతాయని వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. కనీసం ఇలా అయినా బుద్ధి వస్తే చాలు ఇలాంటి పోరంబోకు నాయాళ్లకు అని అనుకుంటున్నారట ఈ వీడియో చూసిన వాళ్లు..  

 

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: