లోకం మొత్తం ఒకటే పాట అదేమంటే.. కరోనా వైరస్‌తో మీ ప్రాణాలు కాపాడుకోండి.. చేతులు శుభ్రంగా కడుక్కోండి.. ముఖానికి మాస్క్ కట్టుకోండి.. ఇలా ఎవరికి ఫోన్ చేసినా ఇలాంటి రక్షణ చర్యలే వినిపిస్తున్నాయి.. ఏ బుడ్డోడిని కదిలించిన చీ దూరం దూరం అంటూ చీదరింపులు కనిపిస్తున్నాయి.. ఇక కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే చేతులను బాగా కడుక్కోవడం ముఖ్యమైన విషయం అని తెలుస్తుంది.. ఇందుకు గాను శానిటైజర్లను ఉపయోగించాలనే ప్రచారం చాలా కొనసాగుతుంది..

 

 

ఇందుకు కొన్ని కొన్ని చోట్ల ఈ శానిటైజర్లను కస్టమర్ల ఉపయోగార్ధం ఆయా వ్యాపార సంస్దలు వారి షాపుల్లో గానీ, బ్యాంకుల్లో గానీ అందుబాటులో ఉంచుతున్నారు.. అంతే కాకుండా ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మరీ మరీ చెబుతుంది.. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హ్యాండ్ వాష్‌లకు, శానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది.

 

 

ఇక ఈ కరోనా భయానికి అందరు శానిటైజర్లను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు.. అంతే కాకుండా కస్టమర్ల సదుపాయం కోసం షాపింగ్ మాల్స్, ఏటీఎంలలో కూడా శానిటైజర్లు పెడుతున్న విషయం తెలిసిందే.. అయితే, పాకిస్థాన్‌లోని ఓ ఏటీఎంలో కూడా శానిటైజర్‌ ఏర్పాటు చేశారు. కాగా ఆ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చిన ఒక కస్టమర్.. శానిటైజర్‌ను నెమ్మదిగా కోటులో పెట్టేసుకుని అక్కడికి నుంచి ఉడాయించాడు.

 

 

ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ ఘటన మార్చి 27న చోటుచేసుకోగా ప్రస్తుతం నెట్టింట్లోకి వచ్చి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ దృష్యాన్ని చూసిన నెటిజన్స్ ఇలాంటి వెధవ కస్టమర్లు ఉంటే కరోనా బాగానే కట్టడి అవుతుంది.. ఏం దొంగరా బాబు.. శానిటైజర్‌ను దక్కనివ్వలేదు.. ఇంకా చేతికి ఏమందినా దొబ్బేసేలా ఉన్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారట.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: