కరోనా వైరస్ నేపధ్యంలో రెండు రాష్ట్రాలు భయం గుప్పిట్లో బ్రతుకులు వెళ్లదీస్తుండగా, మర్కజ్ అనే మర్కటం వచ్చి, ఒకరకంగా ప్రజల ఆశలు చెల్లాచెదురు చేసింది.. తగ్గుతున్న కరోనాను పొగబెట్టి మరీ రాజేసింది.. ఇప్పటికే దాదాపుగా నెలనుండి ఎన్నోతిప్పలు పడుతున్న సామాన్యుడి కడుపులో మర్కజ్ మరో మంటను రగిలించింది.. దీనిఫలితం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు గానీ.. ఈ కరోనా కట్టడి నేపధ్యంలో పోలీసులు మాత్రం తమ ప్రతాపాన్ని ఆకలిగొన్న పులుల్లా ప్రదర్శిస్తున్నారు.. అంతా బాగానే ఉంది కానీ అమాయకులపై లాఠీలు ప్రయోగిస్తే ఉపయోగం ఉంటుందా అని చాలామంది నెటిజన్స్ అడుగుతున్నారు..

 

 

ఇదిలా ఉండగా ప్రజలకు ఆదర్శంగా ఉంటూ, ప్రజల కోసమే ఈ పోలీస్ అనే భారీ డైలాగులు చెబుతున్నా, కొందరు చేసే పనుల వల్ల అసలు పోలీసులంటేనే గౌరవం పోతుంది.. ఇప్పటికే ప్రజలకు పోలీసులంటే ఒక రకమైనా చెడు భావం ఉండగా, ఆ భావన క్రమక్రమంగా తొలిగిపోతున్న సమయంలో కొందరు చేసే పనులవల్ల తిరిగి పోలీస్ వ్యవస్ద అప్రతిష్ట పాలవుతుంది.. ఇకపోతే ప్రజలకు నీతులు చేప్పే నోటితోనే, మాటతప్పుతున్న పోలీసులు అక్కడక్కడ కనిపిస్తున్నారు.. అలాంటి వారిలో ఇప్పుడు మనం చూడబోయే కానిస్టేబుల్ ఒకరు.. ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుంటే..

 

 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సదరు కానిస్టేబుల్ లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతున్నా.. తన గారాలపట్టి ఫస్ట్ బర్త్‌డే నిర్వహించినట్లు తెలుస్తోంది.. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య నిర్వహించుకోవాల్సిన ఈ కార్యక్రమానికి బంధువులను, అతిథులను ఆహ్వానించి వేదిక ఏర్పాటు చేయడం వివాదానికి కారణమవుతోంది.. బర్త్‌డే వేడుకలను హాజరైన వారిలో ఏ ఒక్కరికైనా కరోనా వైరస్ సోకి ఉంటే పరిస్దితి ఏంటో.. ఈ తతంగాన్నంతా పోలీస్ స్టేషన్ సమీపంలో తాను నివాసం ఉంటున్న క్వార్టర్స్ పక్కనే టెంట్ వేయించి నిర్వహించినట్లుగా తెలుస్తుంది..

 

 

కాగా ఓ నెటిజన్ సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇకపోతే పోలీస్ కానిస్టేబుల్ కుమార్తె బర్త్‌డే వేడుకలకు సంబంధించినదిగా చెబతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి నీతి సూత్రాలు వల్లిస్తున్న పోలీసులే.. ఇలా చేస్తే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా ఇప్పటికే వనపర్తి ఘటన పోలీసుల పనితీరుకు మచ్చ తీసుకురాగా.. తాజా ఉదంతం పోలీసు శాఖకు కొత్త తలనొప్పిగా తయారైంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: