ప్రతి మనిషిలో ఏదో ఒక్క టాలెంట్ ఉంటుంది.. కొందరు వారిలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి కష్టమైన సాధనతో దాన్ని మెరుగుపరచుకుని గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు ఎంత టాలెంట్ ఉన్న ధైర్యంతో ముందుకు వెళ్లక జీవితంలో ఎదగలేకపోతారు.. ఇక శ్రమతో, కఠిన సాధనతో, ఏ పనినైన మొదలుపెడితే అది తప్పక విజయం వైపు పరుగులు పెడుతుంది.. అదీగాక శ్రమ శరీరాన్ని దృఢపరిచినట్లే కష్టాలు మనసును దృఢపరుస్తాయన్న విషయాన్ని గ్రహించాలి.. ఈ సృష్టిలో ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే నిజమైన తెలివైనవాడు. ఇకపోతే ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది..

 

 

ఇలా జీవితాన్ని కాలానికి అనుగుణంగా మలచుకుని ముందుకు సాగేవాడినే విజయం వరిస్తుంది.. ఇకపోతే స్కేటింగ్ ఆట అంటే మీకందరికి తెలిసే ఉంటుంది.. ఇందులో కూడా పలు విధాలుగా ఉంటాయి.. ఈ స్కేటింగ్ చేయడం కొంచెం కష్టతరమైనది.. ఈ ఆటలో ఏ మాత్రం తేడా వచ్చినా, బ్యాలన్స్ కంట్రోల్ చేసుకోపోయినా క్రిందపడితే ఉహించని విధంగా ప్రమాదం సంభవించవచ్చూ.. అందుకే ఈ ఆటను ఆడాలంటే కోచ్ నేపధ్యంలో ముందుగా ప్రాక్టీస్ చేయాలి.. ఆతర్వాత స్కేటింగ్ చేసేవారికి వారిమీద నమ్మకం ఏర్పడాలి.. అప్పుడుగానీ ఒంటరిగా స్కేటింగ్ చేయడం కుదరదు..

 

 

ఇక కొందరు చిన్నారులతో సహా ఈ స్కేటింగ్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించారు.. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో చిన్న స్కేటింగ్ బోర్డ్ మీద ఒక యువకుడు సాహాసోపేతమైన విన్యాసాలను ప్రదర్శిస్తున్నాడు.. తానూ స్కేటింగ్ చేస్తూనే జంప్ చేసి ఆ బోర్డ్‌ను గాల్లో గింగిరాలు కొట్టిస్తూ తిరిగి తన రెండు పాదాలను చాలా నేర్పుగా ఆ స్కేటింగ్ బోర్డ్ మీదకు తీసుకొస్తున్నాడు.. ఇతను ఇలా చేసే సమయంలో ఏమాత్రం బ్యాలన్స్ కోల్పోతే జరిగే నష్టాన్ని మీరే ఊహించుకోండి.. ఇక ఈ ఆటను కొందరు తమ ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకుంటే, మరికొందరు సదరాగా నేర్చుకుని వదిలేస్తారు.. ఏది ఏమైన కఠిన సాధనతో మాత్రమే ఇలాంటి కొన్ని ఆటలు అలవరచుకోవచ్చూ.. ఇక ఈ వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి కానీ ప్రాక్టీసు మాత్రం చేయకండి... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: