ఈ సృష్టి ఎంత అందమైనదో, ఇందులో జీవించే ప్రతి జీవి జీవితాన్ని కూడా ప్రకృతి చాలా అందంగా మలిచింది. కానీ మనిషి అనే ప్రాణి తన మనుగడకోసం సమస్త ప్రాణుల ఉనికి ప్రమాదంలో పడవేసి తాను మాత్రం సుఖంగా ఉండాలని ఆశిస్తున్నాడు.. ఈ క్రమంలో ప్రకృతి సక్రమంగా నిర్వహించే విధులకు ఆటంకం కలిగించాడు.. దాని ఫలితమే క్రమక్రమంగా అనుభవిస్తున్నాడు.. ఇప్పటికే అభివృద్ధిపేరిట చేసిన విధ్వంసవల్ల, ఎన్నో ప్రాణులు కనుమరుగైపోయాయి.. ఇందులో కొన్ని రకాల పక్షులు కూడా కంటికి కనిపించకుండా పోయాయి..

 

 

మనిషి ఇప్పటికైన మారక, ఇంకా ఇలాంటి ఆలోచనలు చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తే భావితరాల దృష్టిలో దోషులుగా ముద్రింపబడుతారు.. ఇప్పటికే స్వచ్చమైన ఆక్సిజన్ దొరకడం లేదు.. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు తగ్గిపోయి, కెమికల్స్ ఎక్కువై అనారోగ్యాలు చోటుచేసుకుంటున్నాయి.. ఇకపోతే ఈ ప్రకృతిలో హాయిగా జీవించే పక్షుల గురించి చెప్పాలంటే, ప్రశాంతంగా ఉండే అడవిలోకి వెళ్లి, అక్కడ నివసించే రకరకాలైన పక్షులు చేసే శబ్ధాలు వింటే, స్వార్ధంతో నిండిపోయిన నగరాలకంటే హాయినిగొలిపే అడవులే నయం అనుకుంటారు.. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు ఈ ఆనందాన్ని మరింతగా అనుభవిస్తారు..

 

 

ఇకపోతే పక్షులలో ఉన్న కొన్ని రకాలైన పక్షులను చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది.. ఎందుకంటే కొన్ని రకాల పక్షులు మనసును రంజింపచేసే శబ్ధాలను చేస్తే, మరికొన్ని పక్షులు చిత్రంగా అరుస్తాయి.. కాని ఇప్పుడు మనం చూడబోయే పక్షి మాత్రం అచ్చం మనిషి నవ్వినట్టుగా నవ్వుతుంది.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ వీడియోలో ఉన్న ఆ పక్షిని మీరు చూడండి.. ఇక ఈ పక్షి పేరు కూకబుర్రా.. కింగ్‌ఫిషర్ ఉపకుటుంబమైన హాల్సియోనినేలోని పక్షి ఇది... ఎక్కువగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి, కాని రెక్కల కోవర్టులలో లేత-నీలం రంగు పాచ్ ఉంటుంది.

 

 

దీని నవ్వు విలక్షణంగా ఉంటుంది.. ఈ కూకబుర్రా పక్షులు తూర్పు ప్రధాన భూభాగం ఆస్ట్రేలియాకు చెందినది, కానీ న్యూజిలాండ్, టాస్మానియా మరియు పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి.. దీనిలో ఉన్న మరో విశేషమైన తత్త్వం ఏంటంటే ఇది తమ జీవితంలో.. ఒకే భాగస్వామితో జత కూడుతాయట.. మనుషుల్లా విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెట్టుకోవట... చూసారా పక్షుల్లో కూడా నీతిగా బ్రతికే పక్షులు ఉన్నాయి... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: