జీవితం అంటే నిత్యపోరాటమే.. ఈ విషయాన్ని ఎంతమంది గ్రహిస్తారో తెలియదు గానీ.. మనిషి పుట్టింది మొదలు మరణించే దాక జీవితంతో పోరాడక తప్పదు.. అలసిపోయాననుకుంటే ఓడిపోయినట్లే.. నీ అంతరంగాన్ని అడుగు నువ్వెప్పుడైనా ప్రశాంతంగా ఉన్నావా అని.. అదీగాకుండా నీ బాల్యాన్ని అడుగు పోనీ అదైనా చెబుతుందో.. ఏది చెప్పదు.. ఎందుకంటే నువ్వు చేసే పోరాటం దేనికోసమో నీకే తెలియదు.. అందరు అంటారు ఇది బ్రతుకు పోరాటం అని.. ఏమో కావచ్చూ.. కానీ చివరకు ఎన్నిపోరాటాలు చేసిన ఓడిపోవలసిందే.. పుడమిలో శాశ్వతంగా నిదురించవలసిందే..

 

 

ఇకపోతే కొందరు అసలు భయమే లేనట్లుగా జీవిస్తుంటారు.. మరి కొందరికి చావంటే యమ భయం.. ఒక చావే కాదు నిశబ్ధంగా ఉన్న సమయంలో వారి గుండె చేసే శబ్ధానికి కూడా బెదిరిపోయే వారున్నారు.. ఇలాంటి వారు జీవితంలో ఎన్ని సాధించిన ఎప్పుడు భయం అనేది వారి జేబులోనే ఉంటుంది.. మరికొందరుంటారు.. సాహసవంతులు.. అసలు చావు వీరిని చూస్తేనే భయపడేలా జీవిస్తుంటారు.. ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఒక వ్యక్తి చేస్తున్న విన్యాసాన్ని గమనించండి.. గుండెలు అదిరిపోయేలా ఉన్న ఆ దృష్యాన్ని చూస్తుంటే.. చూసేవారికి కూడా ఒళ్లు జలదరిస్తుంది.. ఎందుకంటే మిద్దెమీదికి ఎక్కి కిందకు చూస్తేనే కళ్లుతిరిగి పడిపోయే వారున్న మనుషుల్లో ఇతను చేస్తుంది సాహసమనుకోవాలో, చావుతో సావాసమనుకోవాలో తెలియదు గానీ నిజంగా అతని ధైర్యానికి మనస్పూర్తిగా అభినందించిన తక్కువే..

 

 

ఒక వైపు కొండలు, మరో వైపు  లోయలు ఉన్న దార్లో అది కూడా చిన్న బాటలో సైకిల్ తొక్కుతున్న తీరుకి గుండెవ్యాధి ఉన్న వారైతే హరి మంటారు ఈ టెన్షన్ పడలేక.. ఎందుకంటే అతను ఇలా స్పీడ్‌గా వెళ్లుచున్న సమయంలో బ్యాలన్స్ గనుక తప్పితే ఇంకేమైనా ఉందా.. కానీ భయానికే భయం పుట్టేలా ఇతను చేస్తున్న సాహసం అమోఘం అనక తప్పదు.. పిచ్చి పిచ్చి టిక్‌టాక్‌లు చేసి ప్రాణాలకు తెచ్చుకుంటున్నారు కొందరు.. మరి ఇతను మాత్రం ఏం ఆశించి ఇంతటి ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడో తెలియదు.. ఏది ఏమైనా వంకలు తిరుగుతూ, స్పీడ్‌గా సైకిల్ పై వెళ్లుతూ ఇతను చేస్తున్న సాహాసానికి ఫిదా కాని వారుండరు.. ఒక్క విషయం అండీ ఇలా చేయాలని మాత్రం ఎవరు ప్రయత్నించకండి ప్లీజ్.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: