ప్రపంచంలో ఇప్పుడున్న స్దితిలో తనకు తెలిసిన వారి పేరు అయినా మరచిపొతారేమో కానీ, కరోనా అనే పేరుని మాత్రం కొన్ని సంవత్సరాల వరకు మరచిపోరు.. ప్రస్తుతం ఎవరు ఊహించని రీతిలో, లోకాన్ని శ్మశానంలా మార్చేస్తుంది ఈ వైరస్.. మొట్టమొదట కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డప్పుడు.. ఆ ఏముందిలే ఇదొక ఊపిరితిత్తుల వ్యాధి.. ఇలాంటివి ఎన్ని చూడలేదు.. ఓ వారం రోజులు యాంటీబయటిక్ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది.. అదే తగ్గిపోతుందని చాలా దేశాలు అనుకున్నాయి.. కాని ఎవరికి తెలియదు.. ఈ వైరస్ ప్రపంచాన్నే నిదురలేకుండా చేస్తుందని.. చిన్న వరదలా మొదలై ప్రపంచాన్నే వణికిస్తుంది..

 

 

తక్కువగా అంచన వేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ, తన ఉనికిని దారుణంగా చాటుతుంది.. దిన దినం రంగులు మార్చే ఊసరవెల్లిలా తనను తాను మార్చుకుంటూ, పరిశోధకులకు సైతం చిక్కకుండా.. ఏ మందులకు లొంగకుండా తన శవ యాత్రలను విజయవంతగా సాగిస్తుంది.. కొన్ని దేశాల్లో అయితే కరోనాతో మరణించిన వారి పరిస్దితులను చూసిన, తెలుసుకున్న హృదయం ద్రవించిపోవడం ఖాయం.. ప్రస్తుత పరిస్దితుల్లో సంఘజీవి అని చెప్పుకునే మానవుని బ్రతుకు కుక్కలకంటే ఘోరంగా మారింది.. ఎవరికి ఎవరు కాకుండా అనాధల్లా చనిపోతున్నారు..

 

 

ఈ కరోనా సమయంలో బ్రతకడానికి పోరాటం చేయాలో, మన వారిని బ్రతికించుకోవడానికి తపన పడాలో తెలియని దుస్దితి.. ప్రతివారిని వెంటాడుతుంది.. ఒక వైపు ఆకలితో అలమటించే బ్రతుకులు, మరో వైపు మరణంతో పోరాడుతున్న మనుషులు.. ఇదంతా ఒక ప్రపంచ యుద్దాన్నే తలపిస్తుంది.. ఈ విషయాన్ని కొందరు అవివేకులు తేలికగా తీసుకుని.. వైరస్ మరింతలా వ్యాపించడానికి కారణం అవుతున్నారు.. అధికారుల మాటలు పెడచెవిన పెడుతూ, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, శనిలా దాపురించారు..

 

 

ఇకపోతే కరోనా వైరస్ ను తక్కువగా అంచనా వేసే వారు కానీ, దాన్ని నిర్లక్ష్యం చేసే వారుకానీ తప్పకుండా ఈ న్యూక్లియస్ మెడికల్ మీడియా రూపొందించిన వీడియో చూడవలసిందే.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: