లోకంలో ఉన్న నానుడి ఏంటంటే.. కోటి విద్యలు కూటి కోసమే అంటారు.. మనిషి జీవితంలో ఎదురయ్యే ఎన్నెన్నో అనుభవాలను వ్యక్తీకరిస్తూ ఇలాంటి సామెతలు జీవిత సత్యాలను తెలుపుతుంటాయి.. ఇకపోతే మనిషి ఏ విద్య నేర్చుకున్న తనకున్న జానెడు పొట్టను నింపుకోవడానికే.. ఇదే కాకుండా తాను నేర్చిన విద్యలు కూడా ఒక్కొక్క సారి ప్రాణాలను కాపాడుతాయి.. ఇలాంటి సంఘటనలు మనుషుల కంటే జంతువుల విషయాల్లో ఎక్కువగా కనబడతాయి.. చిన్నప్పుడు ఇలాంటి ఘటనలను మాస్టార్లు పాఠాల రూపంలో చెబుతుంటే ఆసక్తిగా వినే వాళ్లం.. అయితే వినడంకంటే కళ్లతో చూసినప్పుడు కలిగే ధ్రిల్ వేరుగా ఉంటుంది..

 

 

ఇక ఏదైనా ఆపద ఎదురైనప్పుడు జంతువులు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. మనిషి కూడా వాటి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ఒక్కొక్క సారి వాటిరాత బాగాలేకుంటే ఆ ఆటలు సాగవు గానీ మినిమం జంతువులు గానీ.. పక్షులు గానీ చేసే నటనకు ఫిదా అయిపోవలసిందే.. ఇలాంటి సీనే ఇప్పుడు మనం చూడబోయేది.. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ బాతు చేసిన పని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే.. అదేమంటే.. ఓ కుక్క బాతును వేటాడి చంపేయాలనుకుంది. మెల్లగా బాతు దగ్గరకు వెళ్లింది. తన ప్రాణానికి పోంచి ఉన్న అపాయాన్ని గ్రహించిన ఆ బాతు నేలపై జీవం లేనట్లు పడిపోయింది. దీంతో కుక్క దాన్ని కాసేపు అలా చూస్తుండిపోయింది. అయినా గానీ అది ఎంతకీ కదలకపోవడంతో చనిపోయిందని భావించి అక్కడి నుంచి తిరిగి తన దారిన తాను వెళ్లిపోయింది.

 

 

ఇంకేముంది అలా ఆ కుక్క వెనక్కి తిరిగిందో లేదో.. బతుకు జీవుడా అంటూ ఆ బాతు పరుగులు పెట్టింది. ఇకపోతే ఐఎఫ్ఎస్ అధికారి సుసంత నందా ట్వీట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చూసిన వారిని ఆకర్శిస్తుంది. ఇక ఈ బాతు తెలివిని చూసిన నెటిజనులు ఈ మహానటికి తప్పకుండా ఆస్కార్ ఇవ్వాలంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.. ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: