భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామానికి చెందిన కోడె రాములమ్మ  కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు రాములు అనే వ్యక్తితో 35 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది.తరువాత వాళ్ళిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత 20 సంవత్సరాల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆమె తన భర్తతో కలసి కూలిపనులు చేసుకునేది .మూడు సంవత్సరాల క్రితం తన ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళిచేసింది. అయితే రోజులానే రాములమ్మ కూలీపనులకు వెళ్లి వచ్చింది .

 

ఇంటికి వచ్చిన ఆమె కాస్త కడుపునొప్పితో బాధపడుతూ ఆశ వర్కర్ దగ్గర మందులు అడిగి వేసుకుంది. అయితే ఈ క్రమంలోనే బాత్రూంకి వెళ్లినపుడు ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. షాక్ కి గురైన ఆమె ప్రభుత్వ అధికారులకు తెలిపింది . అయితే బిడ్డ 2.5 బరువు ఉండవలసింది కానీ బిడ్డ బరువు 800 గ్రాములు మాత్రమే ఉండడంతో వైద్యాధికారులు అత్యవసర వైద్యం కోసం భద్రాచలం హాస్పిటల్ కి తరలించారు. అసలు విషయం ఏమిటంటే గత కొన్ని నెలలు గా ఆమెకు నెలసరి రాకుండా ఆగిపోవడంతో అవి వయసు మీదపడడం వల్లనే ఆలా జరిగి ఉంటుందని అనుకొంది .అయితే ఆమె గర్భం ధరించినట్లు ఆమెకు గాని కుటుంబ సభ్యులకు గాని తెలియదు   

మరింత సమాచారం తెలుసుకోండి: