ఒక్కోసారి అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే ఎంతో నేర్పు కావాలి.. మనుషులకైతే తెలిసింది ఒక్కటే అదేమంటే కోపం.. ప్రమాదం సంభవించినప్పుడు తనలోని ఆవేశాన్ని ప్రదర్శించడం.. ఎదురుగా ఉన్న పరిస్దితులను తనకు అనుకూలంగా మార్చుకోకుండా ప్రతికూలంగా మార్చుకుంటాడు.. ఫలితంగా గోటితో పోయేదానికి గొడ్దలిదాక తెచ్చుకుంటాడు.. కానీ ప్రమాదాలను తెలివిగా ఎదుర్కొని వాటి నుండి తప్పించుకోవడంలో జంతువులు, పక్షులు ఎంతో మిన్న.. భగవంతుడు వాటికి మనిషికి ప్రసాధించినంత జ్ఞానం అందించలేదు కానీ.. ఎదురయ్యే అపాయాలను పసిగట్టి వాటి నుండి బయటపడేటంతటి ఉపాయాలను స్పూరింప చేస్తాడు..

 

 

లేకపోతే అడవిలో ఉన్న చిన్న జీవులకు పెద్ద ప్రాణులతో ప్రమాదం ప్రతి క్షణం పోంచి ఉంటుంది.. వాటినుండి సాధ్యమైనంతగా తమ ప్రాణాలను కాపాడుకుంటూనే తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి.. ఇకపోతే ఆటవిక న్యాయం ఎలా ఉంటుందంటే త‌మ క‌న్నా చిన్న జంతువుల మీద పెద్ద జంతువులు ఆదిపత్యాన్ని కొన‌సాగిస్తాయ‌ని ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. కానీ కొన్ని కొన్నిసార్లు  క్రూర‌ మృగ‌మైనా చిన్న చిన్న జీవులపై ఓడిపోతుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వైర‌ల్ అవుతోంది.. అదేమంటే..

 

 

ఆఫ్రికాలో ఉన్న ఓ రోడ్డులోకి రాత్రిపూట ముళ్ల‌పంది ఒకటి రోడ్డుపైకి వ‌చ్చింది. అంతలోనే అటుగా వచ్చిన ఒక చిరుత..ఆ ముళ్ల‌పందిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే ఆ ముళ్ల‌పంది తెలివిగా త‌న‌దేహంపై చుట్టూ ఉన్న ముళ్ల‌ను గొడుగులా విప్పిగా.. ఆ చిరుత ఎలాగైనా ఆ ముళ్ల‌పందిని ఆహారంగా పొందాలని భావించి కొంత ప్రయత్నం చేసింది.. కానీ ఒక ముళ్లు దాని మూతిలోకి దిగగా తిండి సంగతి పక్కన పెట్టి ఆ ముళ్లు తీసుకోవడానికి నానా తంటాలుపడటం ఇక్కడ ఉన్న వీడియోలో కనిపిస్తుంది.. ఇక తనకేం భయంలేదని ఆ ముళ్లపంది ధైర్యంగా అక్కడి నుండి జారుకుంది.. ఇకపోతే చాలా రోజుల క్రితం తీసిన ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: