ఒకప్పుడు మనుషుల గుప్పిట్లో ప్రపంచం ఉండేది.. కాని ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా గుప్పిట్లో ప్రపంచం ఉంది.. నిజంగా మానవ మేధస్సుకు అగ్నిపరీక్ష ఎదురైంది.. ఎన్నో దేశాలు కరోనా అనే చిన్న క్రిమీతో యుద్ధం చేస్తున్నాయి.. కాని దాన్ని ఓడించే ఆయుధాన్ని ఇప్పటివరకు కనిపెట్టలేక పోతున్నాయి.. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం ఒక్కటే ఈ వైరస్ వ్యాపించకుండా చేసే మార్గం.. ఇలాంటి దశలోనే అన్ని దేశాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి.. ఇక ఈ లాక్‌డౌన్ వల్ల ఈ వైరస్ కాస్త అదుపులోనే ఉంది.. కానీ ఆర్ధిక మాంధ్యం మాత్రం తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు..

 

 

ఇప్పటికే పేదమధ్య తరగతి ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు.. ఒకరకంగా ప్రపంచం మొత్తం నిదురలోకి జారుకుంది.. అందులో బయటకు వెళ్లిన సమయంలో మనకు తెలియకుండానే కరోనా సోకే అవకాశాలున్నాయి.. మరి ఇలాంటి సమయంలో కరోనా వైరస్ సోకద్దు అనుకుంటే జాగ్రత్తగా ఇంట్లోనే ఉండటం ఉత్తం అనే సిద్దాంతం ప్రచారంలో ఉంది.. దీనినే కొందరు పాటిస్తున్నారు.. మరికొందరు మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు.. ఇకపోతే ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు క‌రోనాపై పోరు చేస్తోన్న విష‌యం తెలిసిందే. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఆయా దేశాల్లోని రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు ఎప్ప‌టిక‌పుడు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాయి. తాజాగా ఒక గ్రామంలో ఉండే కొంత‌మంది చిన్నారులు క‌రోనా వ్యాప్తి ఎలా ఉంటుందో.. చిన్న వీడియోతో చెప్పేశారు..

 

 

ఈ వీడియోలో ఐదుగురు చిన్నారులు చేతుల్లో నోట్ బుక్ ప‌ట్టుకుని ఫీల్డ్ వ‌ర్క్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారిలో ఒక‌రు టీచ‌రుగా వూవహరిస్తుండగా.. మిగితా న‌లుగురు విద్యార్థులుగా ఉన్నారు... ఇక ఇక్కడ ఆ విద్యార్థులకు టీచ‌ర్ క‌రోనా ఎలా వ‌స్తుందో ప్రాక్టికల్‌గా చూపించాడు. ఈ క్రమంలో స్పైర‌ల్ మాదిరిగా ఇటుకల‌ను పేర్చి, మొద‌టి ఇటుక క‌రోనా వ‌చ్చిన వ్య‌క్తితో పోల్చుతూ... మొద‌టి ఇటుక‌ త‌ర్వాత ఉన్న ఇటుకలను ట‌చ్ చేసి.. అవి మ‌రికొన్నింటిని ట‌చ్ చేస్తే అంద‌రికీ క‌రోనా వ‌స్తుంద‌ని చెప్పాడు.. అదీగాక  క‌రోనాను ఎలా నియంత్రించ‌ వ‌చ్చునో అది కూడ చేసి చూపించాడు.. అదెలా అంటే.. కరోనా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తున్న తరుణంలో ఈ వైరస్ నుండి దూరంగా వెళ్తే క‌రోనా రాకుండా చూసుకోవ‌చ్చ‌ని తెలియపరచాడు

 

 

చూడటానికి చిన్న పిల్లల ఆటలా ఉన్నా.. ఈ వీడియో యావ‌త్ ప్ర‌పంచానికి మంచి పాఠంలా పనిచేస్తుంది.. ఇప్పటికే ఈ వీడియోకు 2.1 ల‌క్ష‌ల వ్యూస్ రాగా.. 49 వేల లైక్స్ వ‌చ్చాయి. 11000  మంది రీట్వీట్స్ చేశారు... ఇటుకలతో చేసిన ప్రయోగమైన సమాజంలో ఉన్న మనుషులు కరోనా నుండి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: