ప్రపంచం ఏమైపోతే నాకేమి.. కరోనా కాదుకదా.. భూకంపం వచ్చినా మాపని మేము ఆపం అంటూ కొందరు చాలా ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.. లోకం అంతట కరోనా వల్ల లాక్‌డౌన్ అమలవుతుండగా.. జనాన్ని భయట తిరగవద్దని అధికారులు పదే పదే హెచ్చరిస్తుండగా.. కొందరు ఆకతాయిలు మాత్రం.. వారి మాటలను లెక్క చేయక పార్టీలంటూ.. బీచ్‌లంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.. ఇలాంటి వారి విషయంలోనే ఒక సామేత వాడుకలో ఉంది.. అదేమంటే వెనకటికి ఓ చక్రవర్తి రోమ్ నగరం తగలబడిపోతుంటే..  పిడేల్ వాయించుకున్నాడట. ఆ చక్రవర్తి బుద్ధులు ఈ యువకుడికి కూడా అబ్బినట్లున్నాయ్. ఎందుకంటే.. ఇతడు కూడా ఆ నగరానికి చెందినవాడే. అదేనండి ఇటలీ పౌరుడే.

 

 

ప్రస్తుతం ఇటలీలో కరోనా వైరస్ మరణమృదంగాన్ని మోగిస్తుంటే.. అక్కడి ప్రజలు క్షణం క్షణం చావుని దగ్గరగా చూస్తూ బ్రతుకుతున్నారు.. బయటకు వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లతీస్తున్నారు.. ఇలాంటి క్లిష్టపరిస్దితుల మధ్య ఆ దేశంలోని రిమిని నగరానికి చెందిన ఓ యువకుడు.. లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా ఇంటి నుంచి ఒంటరిగా బయటకొచ్చి, దగ్గరలో ఉన్న బీచ్ కు వెళ్లి సన్‌బాత్ కోసం అక్కడ వెల్లకిలా పడుకుని హాయిని ఆస్వాధిస్తున్నాడు.. అదేసమయంలో అక్కడి పోలీసులు డ్రోన్లతో గస్తీ నిర్వహిస్తుండగా, ఆ యువకుడు కనిపించాడు. దీంతో పోలీసులు వెంటనే క్వాడ్ బైకులపై అక్కడికి చేరుకుని, శిక్షగా అతడికి భారీ జరిమానా విధించారు.

 

 

అనంతరం పోలీస్ వాహనంలో ఎక్కించి ఇంటికి వద్ద వదిలారు. ప్రస్తుతం ఈ వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది... వారైతే జరిమానాతో సరిపెట్టారు.. మనపోలీసులకు అయితే ఇంతటి ఘనకార్యం చేస్తూ దొరికాడనుకో.. అది మీ ఊహకే వదిలేస్తున్నా.. ఇకపోతే ఇటలీ అంతా శ్మశానంగా మారుతుండగా, ఈ యువకుడు చేసిన పనికి నెటిజన్స్ మాత్రం ఒక స్దాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: