ఈ ప్రపంచంలో ఉన్న అందమైన ప్రదేశం ఏంటంటే జంతు ప్రపంచం అని చెప్పవచ్చు.. ఎందుకంటే అక్కడ జీవిస్తున్న ప్రతి ప్రాణి తన అవసరం నిమిత్తం మాత్రమే జీవిస్తాయి కానీ అత్యాశకు మాత్రం పోవు.. అంతే కాకుండా ఒక్కోసారి తోటి జంతువులతో ఏ కల్మషం లేకుండా ఆడుకుంటూ ఉంటాయి.. నిజానికి అడవిలో జంతువులు గానీ, పక్షులు గానీ చేసే అల్లరికి ఒక హద్దు ఉండదు.. అలాంటి దృష్యాలు అప్పుడప్పు ఎవరిదైనా కెమెరా కంటికి కనబడితే క్లిక్ మనిపిస్తారు.. ఆ తర్వాత ఆ దృష్యాలను చూస్తూ ఆనందిస్తారు..

 

 

ఇకపోతే మనుషుల్లాగా అడవిలో జీవించే జంతువులకు ఏ వైరం ఉండదు.. అవి కేవలం జీవనపోరాటం మాత్రమే చేస్తాయి.. కానీ ఈ సమాజంలో మనుషులు మాత్రం.. పైకి మంచివారిగా నటిస్తూ లోలోపల మాత్రం తోడేళ్లలా జీవిస్తారు.. నిజానికి మనుషుల్ని జంతువులతో పోల్చి వాటిని అవమానిస్తున్నాం కాని.. మనుషులంత నీచ నికృష్టమైన ప్రాణి ఏది ఈ భూమిపై లేదు.. పాముకు కొరల్లో విషముంటే మనుషులకు మాత్రం ఒళ్లంతా విషమే.. ఇక ఇదంతా పక్కన పెడితే.. కోతి అంటేనే అది చేసే చిలిపి చేష్టలు గుర్తుకు వస్తాయి.. అదీగాక దాని మూడు బాగున్నప్పుడు అది ఆడే ఆటలు చూస్తుంటే ఎన్ని బాధలున్న అన్ని మరచి కాసేపు హయిగా నవ్వుకుంటాము.. ఇలాంటి దృష్యమే ఒకటి మనకోసం ఐఎఫ్ఎస్ అధికారి సుసంత నంద సోషల్ మీడియాలో షేర్ చేశారు..

 

 

అదేమంటే ఓ ఫారెస్ట్ లో కోతులు, జింక‌లు పక్కపక్కనే ఉన్నాయి. ఈ గుంపులో ఉన్న ఒక కోతికి బద్దకం ఎక్కువ అనుకుంటాను.. నాలుగడుగులు వేసి ముందుకు పోవడానికి దాని కాళ్లు సహకరించక ఎలాంటి శ్రమ లేకుండా ప‌క్కనుండి వెళ్తున్న‌జింక‌పైకి ఎక్కింది ఆ కోతి. ఇంకేముంది హాయిగా డీర్ రైడ్ చేసుకుంటూ ఓ నాలుగు అడుగులు ముందుకు వెళ్లింది ఆ వానరం. ఇకపోతే నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోను, ఓ డియ‌ర్..ఇది డీర్ క్యాబ్..కోతి కూల్ రైడ్.. అంటూ క్యాప్ష‌న్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టు చేయగా 28వేల వ్యూస్, 2600 లైక్స్ వ‌చ్చాయి. మరీ మీరు చూసి ఎంజాయ్ చేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: