కరోనా యుద్ధం ఒక రోజుతోనో, నెలతోనో పోయేది కాదు.. ఒకవైపు కేసులు తగ్గినట్లే తగ్గి.. మరోవైపు విజృంభిస్తున్నాయి.. అదీగాక కరోనా వచ్చినప్పుడు దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఎవరికి సరిగ్గా తెలియదు.. కానీ ప్రస్తుతం ఇది ఒక లక్షణంతో లేదు.. దాదాపు పన్నెండు లక్షణాలను నిపుణులు పేర్కొంటున్నారు.. మరి ఇలాంటి సమయంలో ఎంత పెద్ద వారికైనా వైద్య సిబ్బందితో చాలా అవసరం పడుతుంది..

 

 

టీవి మెకానిక్, బైక్ మెకానిక్.. ఇలా కొన్ని రకాలైన సుఖాలను అందించేవి లేకున్నా బ్రతకవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో వైద్య సిబ్బంది లేకుంటే మనిషన్న వాడు బ్రతకడం చాలా కష్టం.. అందుకే ఆ దేవుళ్లు ఇప్పుడు వైద్య సిబ్బంది రూపంలో ఇక్కడే ఉన్నారని భావించుకోవాలి.. కానీ కొందరు అజ్ఞానులు, అవివేకులు నిస్వార్ధంగా సేవచేస్తున్న ప్రభుత్వ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు.. ఇది ఆటవిక చర్యకంటే హీనమైనది.. తమ కుటుంబాలను వదలకుని, తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా పోరులో ఎంతగానో శ్రమిస్తున్న ఇలాంటి వారికి మన వల్ల మేలు జరగకపోయినా బాధ లేదు కానీ నష్టం మాత్రం చేయవద్దు..

 

 

ఇంతలా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ మధ్య కాలంలో క‌రోనా వైర‌స్ బారి నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు డాక్ల‌ర్లు, పోలీసులు త‌మ ప్రాణాల‌ను సైతం లెక్కచేయ‌కుండా స‌మాజం కోసం అహ‌ర్నిశలు కృషి చేస్తున్న సమయంలో.. ఇలాంటి వారికి స‌హ‌కరించ‌వలసింది పోయి.. వారిపై దాడుల‌కు దిగుతుండ‌టం దుర‌దృష్ట‌క‌రం.. నీచమైన పని.. ఇలాంటి ఘటనలు అక్కడక్కడ చాలానే జరుగుతున్నాయి.. అందుకే ప్రతి వారికి ఒక విన్నపం.. క‌రోనాకు వ్య‌తిరేకంగా, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు, డాక్ల‌ర్లు  పోరాడుతున్నారు. ద‌య‌చేసి డాక్ట‌ర్ల‌పై దాడి చేయొద్దు. వారే లేకుంటే ఇప్పటికి ఈ సమాజం ఇలా ఉండేది కాదు.. ఒక్కసారి ఇటలీ, అమెరికా, చైనాను చూడండి..

 

 

అందుకే మ‌నమంతా ఐక‌మ‌త్యంగా ఉండి.. వారికి స‌హ‌క‌రిద్దాం. ఇప్పుడు మనముందున్నది పెద్ద సవాల్.. దీన్ని అందరు కలిసి సమర్ధవంతంగా ఎదుర్కోవాలి.. ఇకపోతే తాజాగా క‌రోనా బాధితుల చేతిలో గాయ‌ప‌డిన ఓ మ‌హిళా డాక్ట‌ర్ వీడియోను..  ఘ‌ర్ బైఠో ఇండియా హ్యాష్ ట్యాగ్ తో.. ఆకాశ్ కాశ్య‌ప్ అనే వ్య‌క్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్‌గా మారిన ఈ పోస్ట్ చేసిన వీడియో అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: