ఈ లోకంలో తల్లి ప్రేమ అనేది చాలా విలువైనది. అందుకే ఆ ప్రేమకు వెలకట్టలేము.. ఎవరి ప్రేమలోనైన స్వార్ధం కనిపిస్తుందో గానీ తల్లి ప్రేమలో కల్మషం అంటూ ఏమి ఉండదన్నది జగమెరిగిన సత్యం.. ఈ ప్రేమను పంచడంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే నయం.. ఉదాహరణకు పక్షి తన రెక్కలతో పిల్లలను కాపాడుతుంది. వాటి కోసం గూడు తయారు చేసుకుంటుంది. రెక్కలు రాని పిల్లల కోసం ఆ తల్లి పడరాని పాట్లు పడుతుంది. అందుకే అంటారు.. నిజమైన తల్లి ప్రేమను చవిచూసిన వారికి తెలుస్తుంది తల్లి విలువ.

 

 

అంతెందుకు అడవిలో ఉన్న కౄరమృగాలు కూడా తన పిల్లలపై చూపించే ప్రేమను చూస్తే పేగుబంధానికి ఎంత విలువుందో అర్ధం అవుతుంది.. వేటాడటమే తెలిసిన వాటికి తన పసిపిల్లలను ప్రేమగా చూడమని ఎవరు చెప్పారు.. ఎవరు చెప్పవలసిన అవసరం లేదు.. అది సృష్టి ధర్మం.. అందుకే ఈ భూ ప్ర‌పంచంపై త‌ల్లి ప్రేమ క‌న్నా గొప్ప‌దేది లేదు. ఈ పదం మాన‌వాళితోపాటు అన్ని జీవ‌రాశుల‌కు వ‌ర్తిస్తుంది. ఇకపోతే త‌న పిల్ల‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకునేందుకు త‌ల్లి ఎంత క‌ష్ట‌మైన భ‌రిస్తుంది. ఆ విషయం ఇక్కడి వీడియోలో చూస్తే తెలుస్తుంది..

 

 

ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రాణి గబ్బిలం.. దీన్నే కొలుగో క్షీర‌దం (ఎగిరే లెమూర్స్ ) అంటారు.. ఈ కొలుగో త‌ల‌క్రిందులుగా చెట్టుకు వేలాడుతూ.. త‌న దేహంపై ఉన్న తొడుగులాంటి చ‌ర్మాన్ని గొడుగులా విప్పి.. ఆ తొడుగులో బిడ్డ‌ను ర‌క్షించుకుంటోంది. అందుకే అంటారు ఈ ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి.. వాటినుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది.. ఇక ప్ర‌కృతిలో క‌నిపించే ఎన్నో అద్బుతాల్లో కొలుగో త‌న బిడ్డను కాపాడుకుంటున్న దృశ్యం కూడా ఒక‌టని చెప్పొచ్చు.. చూసారా లోకంలో తల్లి ప్రేమలో స్వార్ధం పెరుగుతుంటే పక్షులు, జంతువుల్లో మాత్రం ఏ మార్పులేదు.. అందుకే అవి స్వేచ్చగా జీవిస్తున్నాయి.. మనం బందీలుగా మారుతున్నాం.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: