సమాజంలో ఏం మనుషులు తయారైయ్యారురా బాబు.. ఒక పక్క కరోనా వచ్చి ప్రజలు కాకుల్లా అల్లాడుతున్నారు.. మరో పక్క ఉగ్రవాదుల దాడిలో సైనికులు మరణించారు.. ఇంకోపక్క ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు.. వీరందరి బాధలు ఒక వైపు అయితే మందుబాబుల యాతన మామూలుగా లేదు.. ఇప్పటికే గొంతులోకి చుక్క దిగక కిక్కు మొత్తం దొబ్బేసినట్లుగా ఉంది.. దీనికి కారణం కరోనానే.. రాష్ట్రం మొత్తం ఈ వైరస్ మూలంగా లాక్‌డౌన్ ప్రకటించగా.. మద్యం షాపులకు కూడా తాళాలు పడ్డాయి..

 

 

ఈ నేపధ్యంలో కొందరైతే పిచ్చివారు కాగా.. మరికొందరు మద్యం అనుకుని కెమికల్స్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. ఇలా చుక్క దొరక్క కొందరు బ్రతుకు జీవుడా అని ఇన్ని రోజులు ఎలాగో బ్రతికారు.. ఆశతో ఏ రోజైన మద్యం దుకాణాలు తెరవకపోతారా.. బ్లాక్‌లో కాకుండా లైన్‌లో నిలుచుని బాటిల్ తెచ్చుకుని ఫుల్‌గా తాగకపోతానా అని వేయికళ్లతో ఎదురు చూస్తున్న మందు ప్రేమికుల ఆశలకు కేంద్రం ప్రాణం పోసింది.. షాపులు ఓపెన్ చేసుకొమ్మని తెలిపింది.. దీంతో అనేక చోట్ల మందు బాబులు మ‌ద్యం దుకాణాల ఎదుట కిలోమీట‌ర్ల మేర క్యూలైన్ల‌లో నిలుచుని మరీ మ‌ద్యం కొనుగోలు చేసారు.. కొన్ని చోట్ల అయితే తోపులాట‌లు జ‌ర‌గ‌డంతో పోలీసులు వైన్ షాపుల‌ను తాత్కాలికంగా మూసివేయించారు.

 

 

అయితే క‌ర్ణాట‌క‌లోని కోలార్ అనే చిన్న ప‌ట్ట‌ణంలో మాత్రం మ‌ద్యం షాపుల‌ను మ‌ళ్లీ తెర‌వ‌డంతో మందు బాబులు ప‌టాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.. చాలా రోజుల త‌రువాత మ‌ళ్లీ మ‌ద్యం షాపులు ఓపెన్ కావ‌డంతో వారు ఆ ఆనందాన్ని ప‌ట్ట‌లేక ట‌పాసులు కాల్చారు. దీంతో ఆ స‌మయంలో తీసిన వీడియో కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు అనేక చోట్ల మ‌ద్యం దుకాణాల‌కు ఉద‌యం 10 నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌గా, తెలంగాణ‌ ప్రభుత్వం మాత్రం మ‌ద్యం అమ్మ‌కాల‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: