ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం.. అరే కళ్ళు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తామ్ మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం.. ఈ పాట అచ్చం ఇప్పుడున్న పరిస్దితులకు అద్దం పడుతుంది.. ఎందుకంటే ఇన్ని రోజులు కరోనా వల్ల చుక్క దొరక్క బీడువారిన నేలలాగా మారిపోయిన మద్యం ప్రియుల బ్రతుకుల్లో వైన్స్ షాపులు ఒపెన్ అనే మాట వారి ఆశలను చిగురింపచేసింది..

 

 

మందుబాబులు  అమితానంద పారవశ్యులై, గుటకలు గుటకలుగా మ్రింగే ఒక్కొక్క పెగ్గు మద్యం గొంతులోకి దిగుతుంటే ఇన్ని రోజులు మిస్ అయినందుకు ప్రేయసి దూరమైన ప్రియుడిలా అల్లాడిపోయారు.. ఆ షాపులు ఇప్పుడు తెరుచుకోవడంతో ఆదరాబాదరాగా వైన్స్‌ షాపులకు పరుగులు తీస్తున్నారు. అప్పటికే అక్కడ భారీ క్యూలైన్‌లు ఉన్నా లెక్క చేయకుండా లైన్లలో నిలబడి మందు సీసా చేతిలో పడగానే వెర్రి ఆనందంతో చిందులు వేస్తున్నారు.. ఇలాంటి దృశ్యాలు ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కనిపించాయి.

 

 

అయితే, మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్‌లో ఇంతకంటే అద్భుతమైన దృశ్యం చూపరులను ఆశ్చర్యపర్చింది. అదేమంటే, నైనిటాల్‌ నగరంలోని మాల్‌ రోడ్డులో ఓ వైన్స్‌ దుకాణం వద్ద మద్యం ప్రియులు మహాయజ్ఞమే చేశారు. ఉరుములు ఉరిమినా, మెరుపులు మెరిసినా వారు ఏమాత్రం బెదరలేదు. కుంభవృష్టి కురిసినా క్యూలైన్లలో నుంచి కదలలేదు. వడగండ్లు పడుతున్నా ఒక్క అడుగు కదపలేదు. అకుంటిత దీక్షతో లైన్లలో నిలబడి మద్యం సీసా చేతిలో పడిన తర్వాతనే ఇంటిబాట పట్టారు.

 

 

ఇదికదా మనం సాధించుకున్న స్వతంత్రం.. తాగడం మన జన్మ హక్కు దాన్ని ఆపేవారు ఎవరు.. ఎన్ని సంకెళ్లు వేసి మద్యాన్ని బందించిన దానికోసం పోరాడితే పోయేది ఏముంది.. పెళ్ళాల పుస్తెలు, జేబులో డబ్బులు తప్పా అని అనుకుంటున్నారట మద్యం ప్రేమికులు..  

 

 

 

 

ఇక మరోచోట మద్యం కోసం క్యూలైన్లలో నిల్చున్న మందుబాబులపై ఓ వ్యక్తి పూలవర్షం కురిపించాడు. ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే మన దేశానికి ఆర్థిక వనరులు వీరే.. ప్రభుత్వం వద్ద నగదు లేదని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా మద్యం ప్రియులు సామాజిక దూరం పాటించక పోవడంతో.. వారిని సరైన మార్గంలో పెట్టేందుకు పోలీసులు శ్రమించాల్సి వస్తుందట.. ఇక ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. మీరు ఓ లుక్కేయండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: