అమ్మయ్య కరోనా అయితే తగ్గలేదు గానీ మాకు మందైతే దొరికేలా చేసారు పెద్దసార్లు అని అనుకుంటున్నారట మద్యం ప్రేమికులు.. ఈ కరోనా సమయంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో దొంగ చాటుగా కూడా మద్యం తాగడానికి వీలు లేకపోవడంతో ఇన్నిరోజులు మందు రుచి చూసిన తాగుబోతుల నాలుక రుచిని కోల్పోవడంతో ఒక్కోక్కరికి వెర్రి, పిచ్చి లేచి ఏదిపడితే అది తాగడం వల్ల కొందరు ఎర్రగడ్ద హస్పిటల్‌కు వెళ్లితే మరికొందరు పాడె ఎక్కారు.. ఇంకొందరు పేషెంట్లుగా మారారు..

 

 

అసలు ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చే ఆదాయమే ఈ తాగుబోతుల నుండి.. దీంతో నలభై రోజుల నుండి మద్యం షాపులు బంద్ కావడంతో ప్రభుత్వ ఖజానా వెలవెల బోయిందట.. ఇదే కాకుండా తాగుబోతుల మనస్సులు కూడా పాడైపోయి నారాజ్ అవుతున్న సమయాన కరోనా గిరోనా జాంతానై ముందు మందు గొంతులోకి దిగితే అన్ని అవే సర్దుకుంటాయని గోల చేస్తున్న మందుబాబుల నోట్లో మందు చుక్కలు పడటానికి వైన్స్ షాపులు అలా ఒపెన్ అయ్యాయో లేవో ఆడ మగ అనే తేడాలేకుండా ఎగబడ్డారు..

 

 

ఈ నేపధ్యంలోనే కొందరు మందు బాబులు ఎకంగా సీఎం కేసీఆర్ తాగుబోతుల బాధ అర్ధం చేసుకున్న మద్యం దేవుడంటూ ఓ వైన్ షాపు ముందు కేసీఆర్ ఫొటో పెట్టి పూజలు, పాలాభిషేకాలు చేస్తు, ఆనందంతో డ్యాన్స్ చేశారు. ఇప్పుడు తాగుబోతులకు కరోనాకు వైద్యం చేసిన వైద్యసిబ్బంది కంటే, రాత్రి పగలు తమ విధులను బాధ్యతగా నిర్వర్తించిన పోలీసులు, పారిశుద్ద కార్మికుల కంటే మందును అమ్మడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వమే దైవంగా మారింది.. ఈ ఆనందాన్ని మనసులో దాచుకోకుండా గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.. అంతే కాకుండా దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.. మీరు ఓ లుక్కేయండి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: