పార్కులు అనగానే.. ప్రేమికుల మురిపాలు, ప్రేయసి ప్రియుళ్ల అలకలకు బుజ్జగింపుల తాయిలాలు, వీలైతే ఇచ్చి పుచ్చు కోవడాలు ఇవి మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి.. మనసును దోచేటంతటి ప్రకృతి సౌందర్యాలు అక్కడ ఉన్న అవి ఎవడికి కావాలి.. లవర్ పక్కనుండగా ఈ ప్రకృతి అందాలకు ఎవడు దాసోహం అవుతాడనే వారు కూడా లేకపోలేదు.. ఇకపోతే యువతలో అందుకోలేనంత స్పీడ్ పెరిగింది.. కానీ ఆ స్పీడ్ సరైన దిశలో పరుగులు పెడితే బాగుండును కానీ జీవితాలను చిక్కుల్లో పడవేసే దిశగా యవ్వనులు ఉద్రేకపడుతున్నారు..

 

 

ఇకపోతే ఈ సృష్టి మహా అద్భుతం అన్న విషయం తెలిసిందే.. అయితే ఈ సృష్టిలో జరిగే కొన్ని సంఘటనలు మాత్రం అంతు చిక్కకుండా ఉంటాయి.. ఒక్కోసారి ప్రకృతి చేసే చర్యలు కూడా ఊహకు అందవు.. ఇలాంటి వాటిని కెమెరాలో బంధించి ప్రదర్శిస్తే నమ్మేవారు ఉండరు.. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా ఇలాంటిదే.. ఈ ఘటనను చూస్తే అచ్చంగా హాలీవుడ్ సినిమాలోని దృశ్యాలుగా కనిపిస్తాయి.. అసలు ఇది నిజామా లేదా గ్రాఫిక్స్ అనే తేడా కూడా తెలియదు. అలాంటి వింత ఒక పార్క్‌లో చోటుచేసుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

 

ఇక విషయం ఏంటంటే.. సాధారణంగా ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలు ఇష్టమొచ్చినట్లు వీస్తాయి. కానీ, స్పెయిన్‌లోని కలహొర్రాలోని పార్కులో చెలరేగిన మంట.. సముద్రంలో అల వచ్చినట్లుగా వెళ్తూ… ఎండిన గడ్డి మొక్కల్ని మాత్రమే తగలబెట్టింది. మధ్యలో ఉన్న చెక్క బెంచీలను ఏం చేయలేదు. మంటలు అలలాగా ముందుకు సాగే ఇక్కడి ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు మంటకు వెనక వైపు నుంచి బలమైన గాలి వీయడం వల్ల ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఎవరు ఏమనుకున్న మనం మాత్రం ఈ అద్భుతాన్ని చూసి ఆనందిస్తాం.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: