విమాన ప్రయాణం అంటేనే వేరేగా చెప్పవలసిన అవసరం లేదు.. గాల్లో ప్రాణాలు పెట్టి ప్రయాణించవలసిందే.. విమానంలోకి వెళ్లి కూర్చున్నామా, మనం గమ్యం చేరేవరకు ఆ దేవుడి మీదే భారం.. పరిస్దితులు అన్ని అనుకూలించాయా సరి లేదంటే దండవేసి దండం పెట్టుకోవలసిందే.. కానీ ఎలాంటి ప్రమాద సంఘటనలు జరగకుండా అధికారులు సాధ్యమైనంత వరకు రక్షణ చర్యలు తీసుకుంటారనుకో అది వేరే విషయం.

 

 

ఇకపోతే ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అవుతూ మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు చూస్తే మాత్రం మళ్లీ విమాన ప్రయాణం అంటే కొందరికి వొంట్లో వణుకు వస్తుంది.. కానీ తప్పదు కదా.. జరిగేది జరక్క మానదు, జరగంది ఎన్నటికి జరగదు అనే రజనీ డైలాగ్ గుర్తు తెచ్చుకుని ముందుకు సాగాలి.. ఇక గతేడాది మే నెలలో రష్యాలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ఎందరో ఎన్నో ఊహించుకున్నారు.. అయితే ఈ ప్రమాద దృశ్యాలను తాజాగా రష్యా విడుదల చేసింది..

 

 

అదేమంటే విమానాశ్రయంలోని సీసీటీవీ కెమేరాల్లో రికార్డైన దృశ్యాల ప్రకారం చూస్తే.. విమానాశ్రయం నుంచి ఈ విమానం టేకాఫ్ అవుతూనే విమానాన్ని అత్యవసరంగా కిందికి దించేందుకు పైలట్ ప్రయత్నించగా, విమానం రన్‌వేను ఢీకొని పైకి బౌన్స్ అయ్యిందట. ఆ వెంటనే రెండోసారి కూడా ల్యాండ్ కావడంతో విమానం తోక భాగం రన్‌వేను బలంగా తాకి మంటలు ఏర్పడ్డాయి.

 

 

ఆ మంటలు కొద్ది క్షణాల్లోనే విమానం వెనుక భాగంలో ఉన్న ప్రయాణికులను చుట్టుముట్టాయి. వారంతా మంటల నుంచి తప్పించుకోడానికి వీలు పడలేదట. అదీకాకుండా ఎమర్జెన్సీ డోర్‌కు కూడా మంటలు వ్యాపించడంతో కేవలం ముందు భాగం నుంచి మాత్రమే కొంతమంది ప్రయాణికులు బయటకు రాగలిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: