కోతి అంటేనే చిలిపి చేష్టలకు చిరునామా.. అయితే ఈ కోతిని ఆడిస్తూ కొందరు పొట్ట గడుపుకుంటారు.. మరి కొందరు ప్రేమగా సాదుకుంటారు.. ఇంకొందరు ఉంటారు కోతి గ్యాంగ్‌స్టర్లు..  వీరు కోతి పిల్లలుగా ఉన్నప్పుడే తెచ్చుకుని వాటికి బాగా ట్రైనింగ్ ఇచ్చి దొంగతనాలకు ఉసిగొల్పుతారు.. ఇలా ఇదివరకు జరిగింది కూడా.. ఇకపోతే కోతి చేష్టలు చూస్తే ఎంత ముచ్చటేస్తుందో, అంతే భయం కూడా మనుసులో కలుగుతుంది.. ఎందుకంటే మనుషుల చేతిలో ఏదైన కనిపించిందంటే ఏం ఆలోచించకుండా చటుక్కున్న లాక్కుని పుటుక్కున మాయం అవుతాయి..

 

 

అయితే జనవాసాల్లో పెరిగే కోతులకు, అడవుల్లో పెరిగే కోతుల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది.. ఇదే కాకుండా కోతుల్లో కూడా గ్రూపు రాజకీయాలు చాలా ఉంటాయి.. ఏది ఏమైనా కొన్ని పనులు చేయడంలో కోతి కోతినే.. ఇకపోతే కోతి ఎక్కడైనా చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడం చూసారా.. ఏ ఊరుకోండి కోతి కిడ్నాప్ చేయడం ఏంటి చిత్రం కాకపోతే అని అంటారు కదా.. కాని ఇది నిజమని నమ్మక తప్పదు అనేలా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

 

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, ఈ వీడియోలో ఉన్న దృశ్యం ఏంటంటే ఒక చిన్న పాప ఇంటి ముందు కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక సైకిల్ మీద వచ్చిన కోతి చిన్న పిల్లను లాక్కుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి కోతిని చూసి గట్టిగా అరవగా, బెదిరిపోయిన ఆ కోతి చిన్నారిని వదిలేసి పారిపోయింది.

 

 

ఇక ఈ సంఘటను చూసిన నెటిజన్స్ ఆ కోతి కావాలని అలా చేసిందా… లేదా పిల్లలను కిడ్నాప్ చేసే వాళ్ళు కోతికి అలాంటి ట్రైనింగ్ ఇచ్చి పంపారా అనే  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కన్నింగ్ కోతి వెలగబెట్టిన కోతి పని మాత్రం కాసేపు ఆ చిన్నారిని భయపెట్టిందని చెప్పవచ్చు.. ఇక మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఎంజాయ్ చేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: