పోలీస్.. ఈ పేరు వింటనే కొందరికి మంచి భావన కలిగితే, మరికొందరికి అసహ్యమనిపిస్తుంది.. ఎందుకంటే లోకంలో మంచి ఉన్నట్లే.. పోలీస్ వ్యవస్దలో మంచి చెడులున్నాయి.. కాబట్టి ఇక్కడ మంచి చేసిన వారు త్వరగా వెలుగులోకి రారో. చెడు చేసిన వారు అంతే త్వరగా వెలుగులోకి వస్తారు.. ఇకపోతే ఒక యువకుడికి తాను పోలీస్ అయితే పేదవారికి మంచి చేయాలనే తపన అనువణువునా జీర్ణించుకు పోతుంది.. ఇందుకు గాను తాను ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఎలాగోలా అనుకున్నది సాధిస్తాడు.. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ ఎప్పుడైతే పోలీస్ యూనిఫాం ఒంటిమీద పడుతుందో, అప్పటి వరకు తనలో ఉన్న మంచిని మట్టిలో పాతరేస్తాడు.. గతం మరచి ప్రవర్తిస్తుంటాడు..

 

 

ఇలా అందరు ఉంటారని కాదు.. కానీ పోలీస్ డిపార్ట్‌మెంట్లో మంచివారు కనిపించాలంటే జల్లడ పట్టాలన్న విషయం అందరికి తెలిసిందే.. ఇక సాటి వారి బాధను అర్ధం చేసుకోని వారు ఎవరైన సరే, వారు ఎంత గొప్పవారైనా సరే.. న్యాయదేవత దృష్టిలో వారికి విలువ ఉండదు.. ఇకపోతే లోకాన్ని కరోనా ముంచెత్తుతున్న సమయంలో పాపపుణ్యాలు పక్కన పెట్టి కొందరు పోలీసులు మానవతా దృక్పధంతో వ్యవహరిస్తూ పేదలకు, వలస కూలీలకు సహాయం చేస్తున్నారు. అయితే వీరికి భిన్నంగా కొందరు పోలీసులు మాత్రం నిస్సహాయులైన వలస కూలీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ సమాజానికి, వారి ఉద్యోగానికి చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారనడానికి ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన నిదర్శనం.

 

 

అదేమంటే.. రాష్ట్రంలోని హాపూర్‌లో మాస్క్ లేకుండా రోడ్డు మీదకు వచ్చిన ఇద్దరు వలస కూలీల పట్ల పోలీసులు జాలీ దయ లేకుండా అమానుషంగా వ్యవహరించారు. మండుటెండలో నడి రోడ్డు మీద వారిచేత పొర్లు దండాలు పెట్టించారు. అంతే కాకుండా అవస్దతతో మధ్యలో ఆ కూలీలు ఆగితే పోలీసులు లాఠీలతో కొడుతున్నారు... ఇకపోతే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా పోలీసుల తీరు పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ఇలాంటి కష్టజీవులకు సహాయం చేయకపోయిన పర్వాలేదు కానీ వాళ్ళను మరీ ఇంత దారుణంగా శిక్షించకండి అని కోరుతున్నారు..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: