మానవత్వాన్ని మరచిపోయి అధికార దుర్వినియోగం చేస్తుంటారు రక్షక భటులు. తాము చేస్తున్నది ఎంతవరకు సబబో ఆలోచించకుండా అధికారాన్ని అడ్డగోలుగా తమకు అనుకూలంగా చేసుకొని సామాన్య ప్రజలపై విరుచుకుపడుతూ వుంటారు. కొందరు పోలీస్ లు సామాన్యులను తమ సొంత ఫ్యామిలీ పర్సన్ గా భావించి వారికీ గౌరవ మర్యాదలను ఇచ్చి వారికీ అవసరమైన సహాయాలు చేస్తుంటారు. అలాంటివారిని చుస్తే చేతులెత్తి మొక్కాలి అనిపిస్తుంది. కానీ మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనను చుస్తే కచ్చితంగా ఆ పోలీస్ పై  అసహ్యం పుట్టాక మానదు అదేసమయంలో పోలీస్ అంటే భయం వేయక తప్పదు. తాజాగా వెలువడిన ఈ వీడియో యావత్ భారత దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది...రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని చింద్వారా అనే గ్రామం నుండి వైరల్ అయినా ఈ వీడియో కొంత మంది అధికారుల కంట పడడంతో ఈ విషయమై ఉన్నత అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ..

 

 

 

ఆ వీడియో లో ..ఓ వ్యక్తిని పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి తన లాటి తో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లేవిధంగా కొట్టి క్రింద పడేస్తాడు అదేవిధంగా అతను పైకి లెగవలసిందిగా తన బూటు కాలుతో తంతాడు...స్పృహకోల్పోయిన అతనిని  కృష్ణ డోంగ్రే మరియు ఆశిష్ అనే ఇద్దరు పోలీసులు వ్యాన్ లో ఎక్కిస్తూ  క్లిప్‌లో కనిపిస్తారు. సదరు పోలీసును వెంటనే విధులనుండి తొలగించారు కానీ  అతనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. అయితే పూర్తి విచారణ కోసం దర్యాప్తును ముమ్మరం చేస్తున్నట్లు  సీనియర్ పోలీసు అధికారి శశాంక్ గార్గ్ విలేకరులతో తెలియజేశారు ...

 

 

 

 

 

ఇదిలా ఉండగా ఈ క్లిప్ - దాదాపు 1 నిమిషం 32 సెకన్ల నిడివి కలిగి ఉంది  - అయితే ఈ వీడియో  పాతది అని పోలీసులు తెలిపారు, కొట్టబడిన వ్యక్తి పరిసరాల్లో రకస్ సృష్టిస్తున్నాడు. అయితే ఈ వీడియో లో సదరు వ్యక్తిని కొట్టటానికి కారణమేంటో తెలుపమని సోషల్ మీడియాలో కోరారు...అయితే ఈ ఘటన చాల అమానుషమైనదని నెటిజన్స్ పిలుస్తున్నారు. మధ్య ప్రదేశ్ లో ఇప్పటివరకు 6170  కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 272 రోగులు మరణించారు. భారతదేశం అంతటా, 1.32 లక్షలకు పైగా ప్రభావితమయ్యారు, 3,867  మందికి పైగా మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: