మనం ఏదైనా చిన్న పాము చూస్తేనే గజగజ వణికి పోతాం.. అలాంటిది ఇది 14 అడుగుల ఉన్న కింగ్ కోబ్రా ను చూస్తే మన పరిస్థితి ఏంటి....? ఉన్న చోటనే గాల్లో ప్రాణాలు కలిసిపోయే అంత భయం మనలో పుడుతుంది. నిజమే కదా... ! 


అయితే ఇక అసలు విషయంలోకి వస్తే.. ఒక 14 అడుగులు ఉన్న కింగ్ కింగ్ కోబ్రా దగ్గరకు వెళ్లి దానికి స్నానం చేయించడం అంటే అబ్బో అది ఆలోచించడానికి ఎంత కష్టంగా ఉంది కదా... ! అయితే ఇక ఈ వీడియోని చూస్తే మాత్రం మీరు గుండె ఆగినంత పని అయిపోతుంది. తాజాగా ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. 


ఇక ఆ వీడియో విషయముకు వస్తే... ఆ వీడియోలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రాకు దగ్గరలో ఉన్న కులాయి నీటిని ఒక బకెట్లో పట్టుకొని స్నానం చేయిస్తున్నాడు. అతను అంత ధైర్యం ఏమో కానీ...  కింగ్ కోబ్రా కూడా ఆ స్థానాన్ని ఆస్వాదించి సేద తీరింది. అంతే కాదు అంత పెద్ద కింగ్ కోబ్రా కు తలపై నిమురుతూ అతను ఆ వీడియోలో కనిపించాడు. అయితే ఈ వీడియోను సుశాంత్ నంద పోస్ట్ చేస్తూ ఆవ్యక్తి పాములను నియంత్రించడంలో అనుభవం ఉన్న వాడు అని, కాబట్టి దయచేసి మీరు ఎవరు ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దని ఇలాంటి పనులు అత్యంత ప్రమాదకరమని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇకపోతే ఆ వీడియోను మీరు కూడా చూసేయండి....

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: