సమాజంలో ఇప్పుడున్న పరిస్దితుల్లో పిల్లలను కనడం ఒక సాహసమైన నిర్ణయం.. ఎందుకంటే వారు పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దవారు అయ్యేదాక ఎదురయ్యే పరిస్దితులను ఎదుర్కోవాలంటే ఎంతో ఓపిక ఉండాలి.. అంతే కాదు తల్లిదండ్రులిద్దరు వారి జాగ్రత్త విషయంలో ఎంతో బాధ్యతగా మెలగవలసి ఉంటుంది.. వారి రక్షణ విషయంలో ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్నా ఊహించని ప్రమాదం ఎదురుగా వస్తుందనడానికి ఎన్నో ఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు..

 

 

ఇక ఈ మధ్య కాలంలో బోరుబావిలో పడి ఎంత మంది పిల్లలు నిర్జీవులు అయ్యారో అందరికి తెలిసిందే.. ఇదే కాకుండా వివిధ ప్రమాదాలతో చనిపోయే వారిలో పిల్లలు కూడా ఉండటం దురదృష్టకరం.. ఇకపోతే పిల్లలను ఎప్పుడు ఒంటరిగా వదల కూడదు.. ఎందుకంటే తెలిసీ తెలియని వయస్సులో వారు ఒక్క చోటు కుదురుగా ఉండరు. పైగా వారు ఆడే ఆటలు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అందుకని ప్రతిక్షణం వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పామును కూడా తాడనుకుని ఆడుకుంటారు కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే ఇదిగో ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో లాగా ప్రమాదంలో పడతారు.. అదేంటో చూస్తే..

 

 

హుబీ ప్రావీన్స్‌లోని డాయి అనే నగరంలోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న చిన్నారి ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చి, అక్కడున్న లిఫ్టులోకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు.. ఇక లిఫ్టులోకి వెళ్ళిన ఆ పాప లిఫ్ట్ బటన్స్ నొక్కింది. దీంతో లిఫ్ట్ ఒక్కసారే కిందికి వెళ్లింది. అదే సమయంలో, పిల్లలు తప్పిపోకుండా చేతికి కట్టే తాడు లిఫ్టు డోర్లో చిక్కుకుంది. ఆ తాడు బిగుసుకుని చిన్నారిని కూడా హఠాత్తుగా పైకి లాగేసింది.. అలాగే ఆ చిన్నారి బిక్క ముఖం వేసుకుని చూస్తున్న కాసేపటికి, ఆ తాడు తెగిపోవడంతో ఒక్కసారే కిందపడింది.

 

 

కాగా ఆ తాడు బలంగా ఉండి ఉంటే ఆ చిన్నారి చేయి విరిగిపోయేది. లక్కీగా తాడు తెగడంతో ఆ చిన్నారికి ప్రాణ గండం తప్పింది. ఇకపోతే లిఫ్టులోని సీసీటీవీ కెమేరాలో రికార్డైన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇది చూసిన వారైనా తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించడం మరవకండని అంటున్నారు నెటిజన్స్..  

 

 

    

మరింత సమాచారం తెలుసుకోండి: