సాహసం చేయాలంటే వయస్సుతో సంబంధం లేదని ఇప్పటికే కొందరు నిరూపించారు, మరికొందరు నిరూపిస్తున్నారు. లోకంలో కొందరు ఏదైనా పని చేయాలంటే విపరీతంగా ఆలోచిస్తారు. అందులో అనుకోకుండా ఎదురయ్యే ప్రమాదాలను ఎదురించడంలో వెనకడుగు వేస్తారు. ఇదంతా వారిలో నెలకొన్న భయం వల్ల, వారు ప్రమాదంలో ఉన్నా లేదా ఎదుటి వారు ప్రమాదానికి గురైనా వెంటనే స్పందించలేరు..

 

 

కాని ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో మాత్రం ఒక బామ్మ తనకు మించిన సాహసమే చేసిందని చెప్పవచ్చూ.. సాధారణంగా ఎవరి కంటికైనా పాము కనబడగానే హడావుడి పడిపోతూ దాన్ని చంపాలని చూస్తారు.. కానీ ఈ బామ్మ అలా చేయలేదు.. మరి ఏం చేసిందనే కదా మీ అనుమానం.. అయితే వినండి.. తాను నివాసం ఉంటున్న ప్రాంతంలోకి ఒక పాము ఎలా వచ్చిందో తెలియదు గానీ ఆ పాముని చూసిన ఈ బామ్మ ఏ మాత్రం బెదిరిపోకుండా, దాన్ని చంపే ప్రయత్నం చేయకుండా ఆ పాము తోకను పట్టుకుని కొంత దూరం వరకు లాక్కెళ్లి పక్కనున్న చెట్ల పొదల్లోకి విసిరేసింది..

 

 

నిజంగా ఇలా చేయాలంటే వయస్సు మీద ఉన్న యువకులే భయపడతారు.. కానీ ఈ బామ్మ మాత్రం బెదిరి పోకుండా ఎంతో ధైర్యంతో, అక్కడున్న వారికి హాని లేకుండా, పాము ప్రాణం పోకుండా దాన్ని క్షేమంగా సాగనంపింది.. ఈ వీడియోలో చూస్తే ఆ పాముని ఏదొ చెత్తబుట్టను పట్టుకెళ్ళినట్లుగా చేతితో పట్టుకుని వెళుతున్న ఈ పెద్దావిడను చూస్తే భయస్తులు మాత్రం చెడ్డి తడిపేసుకోవడం ఖాయం అంటున్నారు ఈ విషయం తెలిసిన వారు..

 

 

ఇకపోతే ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ సుశాంత నందా సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.. దీన్ని చూసిన నెటిజన్స్ ఈ బామ్మ చేసిన సాహసానికి ఫీదా అయిపోయి తెగ మెచ్చుకుంటున్నారు.. మీరు చూసి ఆనందించండి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: