బాసు ఈ ప్రపంచంలో అందరు బ్రతుకుతారు కానీ కొందరు మాత్రమే బ్రతుకులోని అర్ధాన్ని గ్రహించుకుని ఉన్నతంగా జీవిస్తారు.. వారికి డబ్బుతో పనిలేదు, ప్రేమలు ఆప్యాయతల కోసం ప్రాకులాడరు.. నలుగురిలో పొగడ్తలు, చప్పట్లు ఇవేవి వారిని సంతోష పరచలేవు. అలాంటి వారు వారికి నచ్చిన పనిని ఎంత ఏకాగ్రతతో చేస్తారంటే.. ఒక ఋషి తన చుట్టు చెట్లు పుట్టలు అల్లుకుంటున్న తన తపస్సు మాత్రం ఆపడు.. వీరు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు.. అందుకే వారిని చూస్తే బ్రతుకంటే ఇది అని అనిపిస్తుంది..

 

 

ఎందుకంటే మనం ఈ భూమి మీద పడే ముందు మనం ఎవరమో మనకు తెలియదు, కానీ చితికి చేరే ముందు మాత్రం మనం ఎవరమో అందరికి తెలిసిపోతుంది.. కానీ ఒక్కటి మాత్రం నిజం ఒంటరిగా అమ్మకడుపులో నుండి బయటకు వస్తాము, అదే ఒంటరిగా ఎవరికి చెప్పకనే వెళ్లిపోతాము.. ఇదే జీవితం.. కానీ ఈ మధ్యలో ఆడే ఆట ఒకటి ఉంటుంది.. ఇది ఎవరికి అర్ధం కాదు.. కానీ అర్ధం చేసుకునే లోపల అంతా జరిగిపోతుంది.. ఈ పదాలకు సంబందించిన అర్ధాన్ని చాల చక్కగా వర్ణించారు వేటూరి గారు, సాగర సంగమం చిత్రంలో..

 

 

నిజమైన బ్రతుక్కి అర్ధం చెప్పిన ఈ పాట ఏంటంటే.. తకిట తదిమి తకిట తదిమి తందాన, హృదయలయల జతుల గతుల తిల్లాన ఇది పల్లవి.. ఇక చరణంలో మాత్రం పుట్టిన ప్రతి వ్యక్తి చివరకు కలిసేది మట్టిలోనే అని తెలిసి ఎంత భ్రమలో బ్రతుకుతున్నాడో చాల చక్కగా వివరించారు మహానుభావుడు.. ఆ పదాలు చూస్తే.. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన.. తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా, తెలిసీ తేలియని ఆశల వయసే వరసా, ఏటిలోని అలలవంటి కంటి లోని కలలు కదిపి గుండియలను అందియలుగ చేసీ.. వావ్ ఈ పాట పాడిన గాయకుడు, పాట పాడినారు అనే కంటే జీవించారనడంలో సందేహం లేదు..

 

 

ఇక ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఒక వ్యక్తి ఈ పాటకు చేసిన డ్యాన్స్ చూస్తే నిజమైన డెడికేషన్‌కు పూర్తి అర్ధం తెలుస్తుంది.. ఇతను ఒక పెద్ద బంతిని పట్టుకుని ఒక గోడపైన నిల్చుని అది కింద పడకుండా బ్యాలన్స్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలవు.. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో ఇదే పాట వస్తుంటే దానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.. చూసారా టాలెంట్ అంటే ఇది.. ఏకాగ్రత అంటే ఇది.. ఇతన్ని ఎన్ని విధాలుగా పొగిడిన తక్కువే అనిపిస్తుంది కదూ.. కూటికోసం కోటి విద్యలు అంటారు.. బహుశా ఇతను తన పొట్ట నింపుకోవడానికే ఇలా చేస్తున్నాడనుకుంటా.. ఇలాంటి వారిని ఆదరించడంలో ఎలాంటి తప్పులేదు.. ఇక ఈ వీడియో చూశాక మీరైతే ఎలా ఫీలవుతారో మీ యిష్టం.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: