పసిపిల్లలు ఆడుకుంటుంటే చూస్తూ మురిసిపోని తల్లిదండ్రులు ఉండరన్న విషయం తెలిసిందే.. ఇక ఆటలు అన్నవి పిల్లలకు ఎంత ఇష్టమో జంతువులు, పక్షులు అయినా ఆవు దూడలు, గేదె దూడలు, పక్షుల పిల్లలు, కుక్క పిల్లలు ఇలా ప్రతి జీవికి చాలా యిష్టం.. అందుకే అవి కూడా భలేగా ఆడుకుంటాయి.. చిన్నగా ఉన్నప్పుడు అవి ఆడే ఆటలు భలే ముద్దొస్తుంటాయి. వాటి గెంతులు, ఉరుకులు, పరుగులు చాలా తమాషాగా అనిపిస్తుంటాయి.

 

 

ఇక ప్రపంచాన్ని అప్పుడప్పుడే అవి కొత్తగా, వింతగా చూస్తుంటాయి కాబట్టి ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణం వేరేలా ఉంటుంది. మనుషులైన, జంతువులైనా చిన్నగా ఉన్నప్పుడే లోకజ్ఞానం తెలియక ఉంటారు కాబట్టి వారిలో స్వార్ధం ఉండదు.. అందులో అవి తల్లిచాటు బిడ్దల్లా ఉంటాయి.. అంతే కాదు వాటి తల్లులు కూడా వీటిని అంతే జాగ్రత్తగా కాపాడుకుంటాయి.. ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఓ గున్న ఏనుగు పిల్ల తన తల్లితో కలిసి షికారుకు బయలు దేరింది నున్నగా ఉన్న దారివెంట హుషారుగా పరుగులు తీస్తూ ఆటలు ఆడుకుంటుంది..

 

 

ఇంతలో అటుగా వచ్చిన పర్యాటకుల జీపు ఆ గున్న ఏనుగును చూసి ఆగిపోగా అందులో ఉన్న వారు ఆ ఏనుగుపిల్ల ఆటలకు భలే ముచ్చటపడుతున్నారు.. ఇక వీరిని చూడగానే మరింత హుషారు వచ్చినట్లుగా ఆ పిల్ల ఏనుగు తన కాళ్లతో ఇసుకను తంతు, గడ్దిలోకి వెళ్లి ఇసుకలో దొర్లుతూ ఈ కొత్త ప్రపంచాన్ని ఆస్వాదిస్తుంది.. ఇక ఆడింది చాలు అనుకుంది కావచ్చూ ఇసుకలో రెస్ట్ తీసుకుందామని కాస్త తన భారి దేహన్ని వాల్చింది.

 

 

అంతలో తల్లి ఏనుగు రాగానే ఇక ఇంటికి వెళ్లుదాం అని లేచి దాని దగ్గరకు పోయింది.. ఏది ఏమైన అడవిలో ఇలాంటి గమ్మత్తైన ఆటలు చాలా కనిపిస్తాయి.. ఈ ప్రకృతిలో ప్రతి జీవి ఇలాగే మరణించేదాక సంతోషంగా ఉంటే ఒక మనిషి మాత్రం ఎప్పుడు తోటి వారిపై కుళ్లుతో, స్వార్ధంతో బ్రతికేస్తుంటాడు.. ఇక ఈ పిల్ల ఏనుగు ఆటలు చూసి మీరు ఆనందించండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: