భారతదేశ IFS అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మరో వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ఒక చేప బీరు తాగుతున్న దృశ్యం కనబడుతుంది. ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లిన తర్వాత ఆ చేప అతని దొరకగా అతని దగ్గర ఉన్న బీర్ ను ఆ చేపకు మూతి దగ్గర అందించడంతో ఆ చేప కూడా మంచి నీరు లాగే బీరు ను కూడా హ్యాపీ గా ఆస్వాదిస్తోంది. ఇక ఆ వీడియోను నెటిజన్లు విపరీతంగా ఆస్వాదిస్తున్నారు. 

 

ఇక ఈ వీడియోకి సుశాంత్ నంద ఈ చేప కు బాగా వేడిగా ఉన్న రోజున తన స్నేహితుడు నుంచి చల్లని బీర్ ను పొందడం నిజంగానే అదృష్టం అంటూ ట్యాగ్ చేసి  వీడియో పోస్ట్ చేశారు. మీరు కూడా ఆ వీడియో ని చూసి ఎంజాయ్ చేయండి.

 

 

బహుశా ఎవరైనా చేపల వేటకు వెళితే చేప దొరికితే దాన్ని ఇంటికి తీసుకువచ్చి ఎలాంటి కూర వండు కోవాలా అని ఆలోచిస్తారు. కానీ ఆ చేపలు పట్టే వ్యక్తి మాత్రం తనకు దొరికిన చేపలతో ఏకంగా బీర్ పార్టీ చేసుకున్నారు. నిజంగా ఈ చేప లక్కీ చేపనే.  ఒకవేళ మీకు కూడా దొరుకుతే ఇలా ట్రై చేస్తారా... ?

మరింత సమాచారం తెలుసుకోండి: