లోకంలో మనుషులే కాదు జంతువులకు, పక్షులకు కూడా ఫీలింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. అయితే వాటికి కలిగే ఫీలింగ్స్ మనుషులకు అర్ధం కాదులే.. ఒక జంతు ప్రేమికులు తప్ప మరెవరు వాటి గురించి అంతగా పట్టించుకోరు ప్రకృతి ప్రేమికులు ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో, జంతు ప్రేమికులు కూడ వాటి పట్ల ఎంతో ప్రేమతో మెలుగుతారు కాబట్టి వాటి బాధలు గానీ సంతోషాలు త్వరగా అర్ధం చేసుకుంటారు..

 

 

ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఒక పిల్ల గుర్రం పచ్చని గడ్ది మేయడానికి బయటకు వచ్చింది.. కానీ దాని మెదడులో ఏం ఆలోచన వచ్చిందో తెలియదు గానీ గడ్దిమేస్తూ యోగ చేయడానికి ట్రై చేస్తుంది.. నమ్మలేక పోతున్నారా.. లేక గుర్రం యోగ చేయడమేంటని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.. తన ముందు కాళ్లు రెండు బార్లా చాపడానికి ఎలా ప్రయత్నిస్తుందో.. అలా తన కాళ్లను ముందుకు చాచే క్రమంలో అది వెనక్కి వెనక్కి వెళ్లుతుంది.. ఆ గుర్రాన్ని దూరం నుండి చూస్తే అచ్చం మనిషి నడుం పైకి లేపి తలను నేలకు వాల్చుతూ ఆసనం వేస్తున్నట్లుగా కనిపిస్తుంది..

 

 

మరి దీనికి ఇలా చేయడంలో కలిగే ఆనందం ఏంటో మనకు అర్ధం కాదు లేండి.. ఇక దాని పక్కనున్న మరో పెద్ద గుర్రం మాత్రం తన మానాన తాను మాత్రం కడుపు నింపుకుంటుంది.. ఇక ఆ పిల్ల గుర్రం ఆసనాలు అయిపోయినట్లుగా ఉంది.. మరి కాసేపు తల్లి గుర్రం చూట్టు నాలుగు పరుగులు పెడుతూ, చక్కగా గెంతుతూ ఆ మైదానంలో తన హూషారు ప్రదర్శించింది.. చివరికి అలసట వచ్చినట్లుగా ఉంది కావచ్చూ, ఆడినకాడికి చాలనుకుని తల్లిదగ్గరికి వచ్చి దాని కాళ్ల ముందు పడుకుండి పోయింది..

 

 

ఇకపోతే ఈ సృష్టిలో ఒక మనిషి తప్ప ప్రతి జీవి తమ జీవితాన్ని సంతోషంగా గడిపేస్తున్నాయి.. ఎందుకంటే వాటి మనసుల్లో కల్మషాలు, కుట్రలు లేవు, రేపటికి ఏంటి అనే ప్రశ్నలు ఉద్భవించవు.. తరతరాలకు ధనం దాచుకోవాలనే ఆశ కలుగదు దొరికింది తినడం బ్రతికినంత వరకు ఆనందంగా గడపడం మాత్రమే వాటికి తెలుసు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: