ప్రేమ, ఆప్యాయత, అనుబంధం.. ఒక మనుషులకే కాదు.. సృష్టిలో ఏ జీవికైనా సొంతమే.. ఇక అమ్మ అనే పదం ఎంత తీయనైనదో అది దూరమైతే అంతే భారంగా మారుతుంది.. దీనర్ధం తల్లి లేని వారిని అడిగితే తెలుస్తుంది.. కాగా ఇప్పటి కాలంలో మనుషుల మధ్య ప్రేమ, అప్యాయతలు కరువవుతున్నాయి కానీ ప‌క్షులు, జంతువుల మ‌ధ్య అంతులేని ఆప్యాయ‌త‌, అనురాగాలు మాత్రం ఎప్పుడు సజీవంగానే ఉంటున్నాయి.. నేటికాలంలో తల్లిదండ్రులు మరణిస్తే బిజీపనుల వల్ల కావచ్చూ, మరేదైన కారణాలతో కావచ్చూ పిల్లలు చివరి చూపులకు కూడా రావడం లేదు.. ఒకవేళ వచ్చిన ఏదో తూతూమంత్రంగా ఆ కార్యక్రమాలను నిర్వహించి వెళ్లిపోతున్నారు..

 

 

అంతేనా తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చే విలువ.. అన్ని సంవత్సరాలు వారి కడుపులో పెట్టుకుని, ఏ కర్కోటకుడి కంటిలో పడకుండా రాత్రిపగలు సంరక్షించిన పాపానికి ఎందరో అనాధలుగా మారుతున్నారు.. మనుషులను చూసి మారాలంటారు కానీ జంతువులను చూసి మనుషులు నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉందనిపిస్తుంది.. ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో తల్లే లోకంగా బ్రతికే ఓ వానరం పిల్ల త‌న త‌ల్లి చ‌నిపోతే దాని చుట్టు తిరుగుతూ ఆ తల్లిని లేపడానికి శతవిధాల ప్రయత్నిస్తున్న ఘటన పలువురిని కంటతడిపెట్టించేలా ఉంది.. తాను ఒంటరిని అయ్యాన అసలు ఏం జరిగింది.. తన తల్లి ఎందుకు లేవలేకపోతుందని అనుకుంటూ ఒక పిల్ల కోతి అటూ ఇటూ తిరుగుతూ దిక్కులు చూస్తుంది..

 

 

ఎంత ప్రయత్నించినా తల్లి లేవకపోవడంతో బిక్కముఖం వేసింది.. ఇకపోతే ప్రేమించిన వారిని కోల్పోతే అనుభవించే బాధ అంతా ఇంతా కాదు. అది మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా ఒకటేనని ఈ విదారక ఘటన చూస్తే అర్ధమవుతోంది. పేగు బంధం కోసం తల్లడిల్లుతున్న కోతులను చూసైనా తల్లిదండ్రులను పురుగుల్లాగా చూసే బిడ్డలకు కనువిప్పు కలగాలని ఆశిద్దాం..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: