కొన్ని సాధారణ ఘటనలు కూడా కొందరు చేసే పనుల కారణంగా అవి వైరల్ అయిపోతుంటాయి. ఇంకా అలాంటి పనే కొందరు ఖైదీలు చేశారు. జైలు నుండి ఖైదీలు పారిపోవడం అనేది చాలా కామన్.. కానీ ఆ ఖైదీలలో రవి తేజ పూనినట్టున్నాడు.. మేము పారిపోయాము.. మీరు టెన్షన్ పడకండి.. మేము మళ్లీ 15 రోజుల్లో తిరిగివస్తాం అంటూ లేక రాసి పారిపోయారు. ఈ ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

దేవుడా అనిపించే ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటుచేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దవాద్ జుకానవిక్, లిల్ అమెటావిక్ అనే ఇద్దరు సోదరులు ఓ నేరం కింద ఇటలీలోని రెబిబ్బీయా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, ఆ ఇద్దరు జూన్ 2న జైలు కిటికీ ఊచలు కోసి అక్కడి నుండి పరారయ్యారు. అనంతరం జైలు ప్రహారీ గోడలు ఎక్కి బయటకు వెళ్లిపోయారు. 

 

అయితే ఆ ఖైదీలు వెళ్తూ.. ఆ జైల్లో ఓ లేఖను వదిలారు. కుటుంబ సమస్యను తీర్చేందుకు వారు అర్జంటుగా వెళ్లాల్సి వచ్చింది అని, పది హేను రోజుల్లో తిరిగి జైలుకు వచ్చేస్తాం అంటూ ఆ లేఖలో రాశారు. అయితే నిజానికి వారి భార్యలు కూడా జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ఉండటం వల్ల పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కోర్టులోకి వచ్చి లొంగిపోతాం అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

 

ఇంకా దవాద్, లిల్‌లు మోసాలు, వివిధ వస్తువుల దొంగతనం కేసులలో అరెస్ట్ అయ్యారు. అయితే నేరాలకు గాను కోర్టు విధించిన శిక్ష 2029కు పూర్తవుతుంది. కాగా జైలు నుండి పారిపోయి లేఖ ఇచ్చినప్పటికీ.. ఆ లేఖలో హామీ ఇచ్చిన ప్రకారం తిరిగి వచ్చినా సరే వారికి కోర్టు శిక్ష విధిస్తుంది. 

 

ఎంత హామీ ఇచ్చిన జైలు నుండి పారిపోవడం అనేది పెద్ద నేరం కనుక జైలు నుంచి పారిపోయినందుకు వారి శిక్షను మరో ఐదేళ్లకు పొడిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు వారిని వెతికే పనిలో ఉన్నారు. మరి ఆ ఇద్దరు ఖైదీలు లేఖలో రాసినట్లు తమ మాట నిలబెట్టుకుంటారో లేక పోలీసులకు ఎక్కడైనా పట్టుబడుతారో చూడాలి. ఏది ఏమైనా.. ఎంత పెద్ద ఖైదీ అయినా సరే కుటుంబం గురించి అలోచించి వారి అవసరాలు తీరుస్తారు అని ఈ ఘటన చూశాకే తెలుస్తుంది అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: