మనుషులు కోతి నుండి వచ్చారనడానికి ఇప్పుడు మనం చూడబోయే ఉదాహరణ కంటే ఇంకా ఏం కావాలి.. ఎందుకంటే సాధారణంగా ప్రతి వారిలో ఏదో ఒక రూపకంగా చిలిపితనం దాగుంటుంది. కొందరిలో ఉండవలసినంత ఉంటే, మరి కొందరిలో మోతాదుకు మించి ఉంటుంది.. ఇలాంటి వారు చేసే పనులనే కోతి పనులు అంటారు.. ఈ లక్షణం ఉన్న వారు ఎక్కడున్న వారికున్న దురద వల్ల ఏదో ఒక పని చేసి నవ్విస్తారు, ఒక్కోసారి కోపాన్ని కూడా తెప్పిస్తారు.. ఇలాంటి వారి వల్ల అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరగవచ్చూ..

 

 

ఇకపోతే కొందరు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఒక జూకు వెళ్ళారు.. అందులో ఒకతను అక్కడి జంతువులను చూస్తూ తనపనేదో తాను చేసుకోవచ్చు కదా.. కానీ అలా చేయలేదు.. ఆ జూలో ఉన్న సింహాలను రెచ్చగొడుతూ కోతి కంటే పదాకులు ఎక్కువే చదివినట్లుగా చిలిపి చేష్టలు చేశాడు.. ఇక ఇతని చర్యలకు అక్కడున్న వారు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు గానీ ఏ మాత్రం తేడా వచ్చిన ఆ చిలిపి పనులు వల్ల కలిగే ప్రమాదం ఎక్కువే.. ఇకపోతే కోతిలా గెంతుతూ, రెండు సింహాలను ఒక స్దాయిలో రెచ్చగొట్టాడు.. వాటితో పిల్లుల కంటే ఎక్కువగా ఆడుకున్నాడు..

 

 

చివరికి ఇతని చర్యలకు విసుగు వచ్చిన ఆ సింహాలు, వీడేం మనిషిరా బాబూ.. ఒక్క పంచ్ వేసి వేడిరక్తం తాగుదామంటే మమ్మల్నే రింగ్ మాస్టార్ల ఆడుకుంటున్నాడని అనుకుంటూ, హే పోరా నీ చావు నువ్వు చావు ఇక మాకు ఓపికలేదు పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తుంది కాని నువ్వు దొరకడం లేదని కూర్చుండి పోయాయి.. ఇక ఆ జంతువులకు, మనుషులకు మధ్య పెద్ద మందపాటి గాజు ఉండటం వల్ల ఇతని ఆటలు సాగాయి గానీ వాటిని పెట్టిన హింసకు, ఇతను దొరికితే ఆ రివేంజ్ ఏస్దాయిలో ఉంటుందో ఊహించుకోండి.. ఇక నవ్వు తెప్పించేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: