ఈ ప్రపంచంలోని ప్రాణుల రూపాలు వేరైనా, వాటిలో ఉన్న ఆత్మ ఒక్కటే.. అలాగే మాతృత్వానికి అర్ధాన్ని అందించే అమ్మ అనే పదంలోని ప్రేమకు ప్రతి జీవి బానిసే.. ఇందుకు ఉదాహరణగా విభిన్న మనస్తత్వాలు గల జంతువుల మధ్య కనిపించే ప్రేమలను చెప్పవచ్చూ.. ఒక్కోసారి కౄరజంతువులు కూడా సాధు జంతువుల్లా ప్రవర్తించి సాటి జీవి ప్రాణాలు కాపాడుతాయి.. ఇక కుక్క కోతి, పిల్లులు స్నేహంగ మెదిలిన సంఘటనలు కూడా జరిగాయి.. కొందరైతే పులులను, సింహాలను మొదలగు కౄరజంతువులను పెంచుకుంటారు.. వాటితో ఎంతో సన్నిహితంగా మెదులుతుంటారు..

 

 

ఇక సమాజంలో జరిగే పరిస్దితులకు పూర్తి విరుద్ధంగా అడవుల్లోని, జంతువుల్లో కొన్ని కొన్ని దృశ్యాలు కనిపిస్తుంటాయి.. ఈ సృష్టిలో అమ్మ ప్రేమను ఇతరులకు పంచాలంటే పక్షులు, జంతువుల మీదకు మనుషులు కూడా రారు.. మనుషులు పంచే ప్రేమలో పూర్తిగా స్వార్ధం నిండుకుని ఉంటుంది.. చివరికి మాతృత్వాన్ని అనుభవిస్తున్న తల్లి కూడా ఆ ప్రేమను తన కడుపున పుట్టిన బిడ్డకే పంచుతుంది గానీ ఇతర పిల్లలను తన పిల్లలకంటే ఎక్కువగా ప్రేమించలేదు.. కానీ జంతువులు, పక్షులు మాత్రం తన పిల్లలు కాకున్న వాటికి కూడా తన పిల్లల వలే ప్రేమను పంచుతాయి.. ఈ దృశ్యాలే ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో కనిపిస్తాయి..

 

 

ఒక ఒరంగుటాన్ కొన్ని పులి పిల్లలను దత్తకు తీసుకున్నట్లుగా వాటి ఆలన పాలన ఎంత చక్కగా చూస్తుందో ఈ వీడియోలో కనిపిస్తుంది.. వాటికి పాలు పట్టడం దగ్గరి నుండి, ప్రేమగా ముద్దులు పెట్టడం, ఆడించడం, లాలించడం, ఇలా ఒక అమ్మ తన పిల్లలతో ఎలా ఉంటుందో అలాగే ఈ ఒరంగుటాన్ కూడా ప్రవర్తిస్తుంది.. తనలోని స్వచ్చమైన ప్రేమకు ఆ పులులు కూడా కొంత కాలానికి కౄరత్వాన్ని మరచిపోతాయోమో అన్నంతగా వీటి మధ్య ప్రేమ కనిపిస్తుంది.. ఇక అన్ని ఆలోచించే నేర్పుగల మనిషి సాటివారి పట్ల, పిల్లల పట్ల మృగంగా ప్రవర్తిస్తుంటే, జంతువులు మాత్రం మనుషులు సిగ్గుపడేలా జీవిస్తున్నాయని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: