కరోనా ఎఫెక్ట్ ఎంతోమంది జీవితాలను తారుమారు చేసింది. కరోనా వల్ల కొందరి ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు వ్యాపారాలు కోల్పోయారు.. మరి కొందరు అయితే తిండిలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ దారుణమైన పరిస్థితి కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచమంతా ఇదే పరిస్థితి. 

 

ఎంత దారుణమైన పరిస్థితి అయితే ఏంటి మనం మళ్లీ మన జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం అంటుంది థాయ్‌‌లాండ్‌లోని చోన్‌ డేన్‌కు చెందిన ఓ మహిళ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కనిథా తొంగ్నాక్ అనే మహిళా కరోనా వల్ల దారుణంగా నష్టపోయింది. అంటే సాధారణంగా ఈమె చేసే వ్యాపారం చనిపోయిన వ్యక్తుల దుస్తులను సెకండ్ హ్యాండ్‌లో అమ్మడం.   

 

IHG

 

ఇంకా ఈ కరోనా వల్ల ఆ పరిస్థితి పోయింది. దీంతో కుటుంబాన్ని పోషించలేక అష్టకష్ఠాలు పడుతుంది. దీంతో ఏం చెయ్యాలి అని ఆమె ఆలోచనలో పడింది. ఇంకా సరిగ్గా ఆ సమయంలోనే ఆమెకు ఓ రోజు ఐడియా వచ్చింది. అదే జోంబీ. వైరస్ పట్టిన దెయ్యం మనుషులు చూసేందుకు ఆసక్తి చూపుతారు అని ఆమె ఆ వేషం వేసుకుంది. 

 

ఇంకా దుకాణానికి ప్రజలు రారు అని ఆన్‌‌లైన్ ద్వారా తన వ్యాపారానికి ప్రచారం కల్పించుకోవాలని నిర్ణయించుకుంది. ఇంకా అనుకున్నట్టుగానే ఆమె జోంబీలా మేకప్ వేసుకోని ఆన్‌లైన్‌లో కనిపించడం మొదలు పెట్టింది. దీంతో సుమారు 4 వేల మందికి పైగా నెటిజనులు ఆమె వీడియోలు చూస్తున్నారు. ఇంకా ఆ సమయంలోనే ఆమె సెకండ్ హ్యాండ్ దుస్తులను ప్రదర్శిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఆమెకు చిరునామా అడిగి దుస్తులను కొనుగోలు చేయడానికి వస్తున్నారు. కొందరు ఆన్లైన్ చెల్లింపులతో ఆ బట్టలను ఆర్డర్ చేస్తున్నారు. ఇలా ఆమె ఒక్క ఐడియాతో ఆమె కుటుంబం ఆకలి తీరుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: